IPL 2022: Ruturaj Gaikwad Comments On Opening Record With Conway, Says Faf May Be Jealous - Sakshi
Sakshi News home page

Ruturaj Gaikwad: రికార్డులు బద్దలు.. డుప్లెసిస్‌ అసూయ పడి ఉంటాడు: రుతురాజ్‌ గై​క్వాడ్‌

Published Mon, May 2 2022 3:32 PM | Last Updated on Mon, May 2 2022 4:48 PM

IPL 2022: Ruturaj Gaikwad On Opening Record With Conway Faf May Be Jealous - Sakshi

రుతురాజ్‌ గైక్వాడ్‌-డెవాన్‌ కాన్వే, ఫాఫ్‌ డుప్లెసిస్‌(PC: IPL/BCCI)

Ruturaj Gaikwad-Devon Conway Break CSK Record: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే అదరగొట్టారు. గతేడాది ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ అయిన రుతు ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లో(6 ఫోర్లు, 6 సిక్సర్లు) 99 పరుగులు చేయగా.. కాన్వే 55 బంతుల్లో(8 ఫోర్లు, 4 సిక్సర్లు) 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ​ క్రమంలో ఇద్దరూ కలిసి 107 బంతుల్లో 182 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

తద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున షేన్‌ వాట్సన్‌- ఫాఫ్‌ డుప్లెసిస్‌ తరఫున ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో వాట్సన్‌- డుప్లెసిస్‌ 181 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా సీఎస్‌కే తరఫున అదే అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌. ఇప్పుడు రుతు- కాన్వే ఓపెనింగ్‌ జోడీ దీనిని అధిగమించింది. 

అదే విధంగా.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీగా నిలిచింది. డేవిడ్‌ వార్నర్‌- జానీ బెయిర్‌స్టో(ఎస్‌ఆర్‌హెచ్‌- 185), గౌతమ్‌ గంభీర్‌- క్రిస్‌ లిన్‌(కేకేఆర్‌ 184 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌- మయాంక్‌ అగర్వాల్‌(కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

ఇక ఈ అరుదైన రికార్డుపై సంతోషం వ్యక్తం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ రికార్డు భాగస్వామ్యం చూసి ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కుళ్లుకొని ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. 

ఈ మేరకు.. ‘‘కాన్వేతో రికార్డు భాగస్వామ్యం ఇది. సీఎస్‌కే తరఫున ఈ భాగస్వామ్యం అత్యధికం. ఈ విషయంలో ఫాప్‌ కాస్త అసూయ పడుతున్నాడనుకుంటా(నవ్వులు). అసలు ఇది సాధ్యమవుతుందని మేము ఊహించలేదు. శుభారంభం ఇవ్వాలని భావించాం. వికెట్లు పడకుండా జాగ్రత్త పడాలని ముందే నిర్ణయించుకున్నాం’’ అని రుతు చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2021లో డుప్లెసిస్‌ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

రుతురాజ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ రుతు(635) కంటే కేవలం రెండు పరుగులు వెనుకబడి(633) ఆరెంజ్‌ క్యాప్‌ చేజార్చుకున్నాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేల-2022 నేపథ్యంలో సీఎస్‌కే అతడిని రిటైన్‌ చేసుకోకపోవడంతో ఆక్షన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 7 కోట్ల రూపాయలు వెచ్చించి డుప్లెసిస్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ అతడిని కెప్టెన్‌గా నియమించింది. 

ఐపీఎల్‌ మ్యాచ్‌-46: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్లు
చెన్నై-202/2 (20)
హైదరాబాద్‌-189/6 (20)

చదవండి👉🏾 MS Dhoni: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement