IPL 2023: Most Century Partnerships By a CSK Opening Pair in IPL - Sakshi
Sakshi News home page

IPL 2023: సీఎస్‌కే ఓపెనర్ల సరి కొత్త చరిత్ర.. ఇదే తొలి సారి

Published Mon, Apr 3 2023 8:54 PM | Last Updated on Mon, Apr 3 2023 9:25 PM

Most century partnerships by a CSK opening pair in IPL: - Sakshi

చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఈ జంట ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అత్యధిక సార్లు సెంచరీ భాగస్వా‍మ్యం నమోదు చేసిన జోడిగా వీరిద్దరూ నిలిచారు.

ఇప్పటివరకు వీరిద్దరూ మూడు సార్లు సెంచరీ భాగస్వా‍మ్యం నెలకొల్పారు. ఇంతకుముందు వరకు ఈ రికార్డు మురళీ విజయ్, మైఖేల్ హస్సీ పేరిట ఉండేది. వీరిద్దరూ రెండు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును గైక్వాడ్‌, కాన్వే బ్రేక్‌ చేశారు.
రుత్‌రాజ్‌ హాఫ్‌ సెంచరీ..
కాగా ఐపీఎల్‌-2023లో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. రుత్‌రాజ్‌ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా కాన్వే కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.  29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement