టీమిండియా యంగ్ క్రికెటర్, నయా మిస్టర్ కూల్, ధోని శిష్యుడు రుతురాజ్ గైక్వాడ్ తన గురువు ధోని, క్రికెట్ దిగ్గజం సచిన్, రన్ మెషీన్ విరాట్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మల జాబితాలో చేరిపోయాడు. పై పేర్కొన్న నలుగురు దిగ్గజాలలా రుతురాజ్‌కు కూడా పాదాభివందనం చేసే ఫ్యాన్స్ దొరికారు. ఇలా అనడం కంటే రుతురాజ్ అభిమానుల పాదాభివందనం నోచుకునే స్థాయికి ఎదిగాడనడం కరెక్ట్ అవుతుందేమో.
ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ ప్రేక్షకుడు (రుతురాజ్ వీరాభిమాని) మైదానంలోకి ప్రవేశించి, రుతురాజ్ కాళ్లను మొక్కాడు. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆర్మీ ఈ సీన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది.
A fan touched the feet of Ruturaj Gaikwad in Maharashtra Premier league 💛#WhistlePodu #Yellove #CSK pic.twitter.com/pA3RNUcjGk
— CSK Fans Army™ (@CSKFansArmy) June 18, 2023
ఎంపీఎల్-2023లో పునేరీ బప్పా ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్.. కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులను ఎదుర్కొన్న రుతు.. 5 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 237.04 స్ట్రయిక్ రేట్‌తో 64 పరుగులు సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో పునేరీ బప్పా టీమ్.. కొల్హాపూర్ టస్కర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను మనువాడిన రుతురాజ్.. కొల్హాపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన భార్య జెర్సీ నంబర్‌తో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే అభిమాని రుతురాజ్‌కు పాదాభివందనం చేశాడు.
ఇదిలా ఉంటే, రుతురాజ్ గైక్వాడ్ తన కామ్ బిహేవియర్ కారణంగా తరుచూ ఎంఎస్ ధోనితో పోల్చబడుతుంటాడు. అలాగే అతనికి ధోనిలా అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సురేశ్ రైనా లాంటి సీనియర్ క్రికెటర్ ప్రశంసించాడు. తాజాగా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోనూ రుతురాజ్ తన గురువు బాటలో నడుస్తుండటంతో అభిమానులంతా ఇతన్ని ధోనితో పోలుస్తున్నారు. కొందరు రుతురాజ్‌ను టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment