IPL 2022: CSK Opener Devon Conway Get Marriage With Long-Time Girlfriend Kim Watson - Sakshi
Sakshi News home page

Devon Conway: ఇష్ట సఖిని మనువాడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌

Published Mon, Apr 25 2022 1:20 PM | Last Updated on Mon, Apr 25 2022 4:07 PM

IPL 2022: CSK Batter Devon Conway Gets Married To Girlfriend Kim - Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌ డెవాన్ కాన్వే ఏప్రిల్‌ 23న తన ఇష్ట సఖి కిమ్‌ వాట్సన్‌ను మనువాడాడు. వీరి వివాహం కాన్వే మాతృ దేశమైన దక్షిణాఫ్రికాలో బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కాన్వే, కిమ్‌ జోడీ మూడేళ్ల డేటింగ్ అనంతరం పెళ్లితో ఒక్కటయ్యారు. కాన్వే వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోను సీఎస్‌కే యాజమాన్యం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 


కాగా, కాన్వే తన వివాహ వేడుక కోసం తాత్కాలికంగా ఐపీఎల్ బయోబబుల్‌ను వీడిన సంగతి తెలిసింది. కాన్వే బయోబబుల్‌ను వీడేముందు సీఎస్‌కే యాజమాన్యం ప్రీ వెడ్డింగ్ పార్టీని అరేంజ్‌ చేసింది. ఈ వేడకులో సీఎస్‌కే ఆటగాళ్లు పంచకట్టులో డ్యాన్సులేసి రచ్చరచ్చ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే పరిస్థితి గందరగోళంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు గాయాలు, వరుస ఓటములతో (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) సతమతమవుతోంది. పసుపు దళం ఇవాళ తమ 8వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది.  

ఈ మ్యాచ్‌కు డెవాన్‌ కాన్వే అందుబాటులో ఉండటం లేదు. కాన్వేను సీఎస్‌కే బేస్ ధర రూ. కోటికి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌లో ఆడుతున్న కాన్వే ఇప్పటివరకు ఒక్కమ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఇందులో అతను 3 పరుగులు మాత్రమే చేయడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున మెరుపులు మెరిపిస్తున్న కాన్వే జన్మ స్థలం దక్షిణాఫ్రికా కావడంతో అతను అక్కడే వివాహం చేసుకున్నాడు. కాన్వే మే 1న సీఎస్‌కే వర్సెస్‌ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సమయానికి అందుబాటులో ఉంటాడు.
చదవండి: IPL 2022: లక్నోకు భారీ షాక్‌! మళ్లీ అదే తప్పు.. ఇంకోసారి చేశారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement