ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. దిగ్గజ ఆటగాడిని గుర్తుచేస్తూ! | IPL 2022 CSK Star Devon Conway Immitates Brain Lara Batting Practice | Sakshi
Sakshi News home page

Devon Conway: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. దిగ్గజ ఆటగాడిని గుర్తుచేస్తూ!

Published Tue, Apr 5 2022 4:49 PM | Last Updated on Tue, Apr 5 2022 8:55 PM

IPL 2022 CSK Star Devon Conway Immitates Brain Lara Batting Practice - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కే తరపున డెవన్‌ కాన్వే ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కాన్వే కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కాన్వేకు అవకాశం రాలేదు. అతని స్థానంలో మొయిన్‌ అలీ తుది జట్టులోకి రావడంతో కాన్వేకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాన్వే జట్టులోకి రావడానికి ప్రాక్టీస్‌ సెషన్‌లో తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే కాన్వే విండీస్‌ మాజీ దిగ్గజం బ్రియాన్‌ లారాను గుర్తు చేస్తూ అతని షాట్లతో మెప్పించాడు.

దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్‌కే తన ట్విటర్‌లో పంచుకుంది. '' అచ్చం లారాను తలపిస్తూ షాట్‌ ఆడానా అని కాన్వే ప్రశ్న వేయగా.. ఈరోజు మరోసారి మేము లారాను చూస్తున్నాం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్‌ ఓటమి తర్వాత సీఎస్‌కే లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌తో ఆడింది. లక్నో చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన సీఎస్‌కే పంజాబ్‌తో మ్యాచ్‌లో దారుణ ఆటతీరు కనబరిచింది.

టాపార్డర్‌ అంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మధ్యలో శివమ్‌ దూబే అర్థసెంచరీతో మెరిసినప్పటికి.. ధోని మినహా మిగతావారు సహకరించడంలో విఫలం కావడంతో ఓటమిపాలైంది. ధోని నుంచి కెప్టెన్‌ బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా అటు కెప్టెన్‌గా.. బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు.  ఇక  మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.  ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ ఏప్రిల్‌ 9(శనివారం) ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది.

చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్‌కే పని అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement