స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లో విషాదం: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’ | CSK Devon Conway Wife Revealed That They Lost Their Unborn Child, Emotional Post Goes Viral - Sakshi
Sakshi News home page

Devon Conway - Kim Watson: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’.. అమ్మా-నాన్న.. ఏడవద్దు ప్లీజ్‌!

Published Sat, Feb 10 2024 7:32 PM | Last Updated on Sat, Feb 10 2024 8:00 PM

CSK Devon Conway Wife Revealed They Lost Their Unborn Child - Sakshi

Devon Conway: న్యూజిలాండ్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్వరలోనే పండంటి బిడ్డను ఎత్తుకుంటామని ఆనందంగా ఎదురుచూస్తున్న కాన్వే- కిమ్‌ దంపతులకు శోకమే మిగిలింది.

ఈ ప్రపంచంలోకి రాకుండానే.. తల్లి గర్భంలోనే పాపాయి కన్నుమూసింది. ఈ విషయాన్ని కాన్వే భార్య కిమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను.

సిగ్గుపడాల్సిన విషయం కాదు
కానీ.. గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది స్త్రీలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారో నాకు తెలుసు. అయినా, ఈ విషయాన్ని చెప్పడానికి నేనేమీ బాధపడటం లేదు.

సిగ్గుపడటమూ లేదు. ఎందుకంటే.. నాలాగే ఏ మహిళకైనా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి కదా! అందుకే నా మనసులోని భావాలను ఇలా పంచుకుంటున్నాను.

ఏదో ఒకరోజు మా జీవితాల్లో మళ్లీ అద్బుతం జరుగుతుంది. తను మళ్లీ తిరిగి వస్తే బోలెడంత ప్రేమను కురిపించేందుకు మేము సిద్ధంగా ఉంటాము’’ అంటూ కిమ్‌ కాన్వే ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది.

అమ్మా.. నాన్నా.. ప్లీజ్‌ ఏడవద్దు
‘‘చిన్నారి సీతాకోక చిలుకా: నీలోనే నే జీవించాను. నీ ప్రేమలో మునిగితేలాను. అమ్మా.. నాన్నా.. ప్లీజ్‌ ఏడవద్దు. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. కాకపోతే ఆకాశం నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉంటాను’’ అంటూ భావోద్వేగంతో సాగే కవితను కిమ్‌ ఈ సందర్భంగా పంచుకుంది. కాగా జనవరి 31న కిమ్‌ ఈ పోస్టు పెట్టగా తాజాగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కాన్వే అభిమానులు అతడి పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్‌-2023లో సత్తా చాటి
కాగా చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగితేలిన కాన్వే- కిమ్‌ 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో 2022లో సౌతాఫ్రికాలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక కివీస్‌ కీలక బ్యాటర్లలో ఒకడైన డెవాన్‌ కాన్వే.. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

గత సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లో 672 పరుగులు సాధించిన కాన్వే.. సీఎస్‌కే ఐదోసారి ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

చదవండి: Virat Kohli: 13 ఏళ్లలో ఇదే తొలిసారి.. మేమంతా నీతోనే! ఆర్సీబీ ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement