న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే ప్రపంచ రికార్ఢు సృష్టించాడు. ఆడిన మొదటి ఐదు టెస్టుల్లో వరుసగా 50 ప్లస్ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా కాన్వే నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆర్దసెంచరీ సాధించిన కాన్వే ఈ ఘనతను నమోదు చేశాడు. కాన్వే ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా, మొత్తం 5 టెస్టుల్లో 50 పైగా పరుగులు సాధించాడు. దీంట్లో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో 99 పరుగులు చేసిన కాన్వే తన మూడో సెంచరీకు ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.
ఇక తన అరంగేట్రం చేసిన తొలి టెస్ట్‌లోనే ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించి కాన్వే.. సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అదే విధంగా టెస్టు ఛాంఫియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్‌పై 54 పరుగులతో కాన్వే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు న్యూజిలాండ్ పూర్తి అధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్ 186 పరుగులు సాధించి డబుల్ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.
చదవండి: SA vs IND: 'పంత్‌ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది'
Comments
Please login to add a commentAdd a comment