రచిన్ రవీంద్ర మెరుపు అర్ధ శతకం (PC: Blackcaps X)
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 32 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు.
19 బంతుల్లోనే 54 రన్స్
రచిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా రచిన్‌కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు.
రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji
— piyush (@piyushson17) February 21, 2024
చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ!
A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA
— BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024
Comments
Please login to add a commentAdd a comment