చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్‌కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్‌గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్‌కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్‌కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్‌కే యాజమాన్యం ముందు రచిన్‌తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్‌లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్‌గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది.
రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్‌కే మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్‌గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్‌కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు..
ఎంఎస్ ధోని వికెట్‌కీపర్‌బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్)
డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు
అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు
అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు
నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు
మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు
శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు
రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు
షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు
మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు
తుషార్ దేశ్‌పాండే బౌలర్ 20 లక్షలు
ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు
మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు
సిమ్రన్‌జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు
దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు
ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు
మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు
రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు
శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు
డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు
సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు
ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు
అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment