Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.
కాన్వే స్థానంలో అతడు జట్టులోకి
ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది.
పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు.
కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది.
రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు
మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్‌టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.
ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు:
టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్.
చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment