న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజే కాన్వే సెంచరీ బాదాడు. కాగా 2022 క్రికెట్‌లో డెవన్ కాన్వేది తొలి సెంచరీ కావడం విశేషం. అయితే టి20 ప్రపంచకప్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో తాను ఔటయ్యాననే కోపంతో తన కుడిచేతిని బ్యాట్‌కు బలంగా కొట్టుకున్నాడు. దీంతో చేతికి గాయం కావడంతో దాదాపు ఏడు వారాలు జట్టుకు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న కాన్వే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జనవరి 1న ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే సెంచరీ సాధించి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
చదవండి: Team India Schedule 2022: బిజీ బిజీగా టీమిండియా.. 2022లో ఆడనున్న మ్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ టామ్ లాథమ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినప్పటికి.. విల్ యంగ్(52) ఆకట్టుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కాన్వే 122 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 17, టామ్ బ్లండెల్ 1 పరుగుతో ఆడుతున్నారు.
చదవండి: Kieron Pollard: కెప్టెన్‌గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
Two hundreds and two fifties in his first seven Test innings!
— ESPNcricinfo (@ESPNcricinfo) January 1, 2022
Devon Conway returns from injury with a 💯 🙌 #NZvBAN
Comments
Please login to add a commentAdd a comment