Mohammed Shami Shatters Devon Conway Stumps - Sakshi
Sakshi News home page

IPL 2023- Mohammed Shami: వావ్.. వాట్ ఏ బాల్.. మిడిల్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా! వీడియో వైరల్‌

Published Sat, Apr 1 2023 1:34 PM | Last Updated on Sat, Apr 1 2023 2:11 PM

Mohammed Shami Shatters Devon Conways Stumps, - Sakshi

PC: IPL.com

Gujarat Titans vs Chennai Super Kings: ఐపీఎల్‌-2023లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 2 కీలక వికెట్ల పడగొట్టాడు. ముఖ్యంగా సీఎస్‌కే ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను షమీ ఔట్‌ చేసిన తీరు మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.

అద్భతమైన బంతితో కాన్వేను షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రెండో బంతిని కాన్వే స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్భుతంగా స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టంప్‌ను గిరాటేసింది.

దీంతో కాన్వే ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కాన్వే వికెట్‌తో ఐపీఎల్‌లో 100 వికెట్ల తీసిన ఎలైట్‌ జాబితాలో షమీ చేరాడు. ఈ ఘనత సాధించిన 19వ బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ మైల్‌స్టోన్‌ను 94 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ..
              WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్‌ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్‌’ రేసులో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement