టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్ పాండ్యానే బౌలింగ్ చేశాడు. ఓవర్ నాలుగో బంతిని పాండ్యా ఆఫ్‌సైడ్ వేయగా కాన్వే డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో స్రెయిట్ షాట్ ఆడాడు. దీంతో పాండ్యా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. పాండ్యా క్యాచ్‌కు కాన్వే బిక్కమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు షమీ కూడా డారిల్ మిచెల్‌ను ఇదే తరహాలో ఔట్ చేయడం విశేషం.
తొలి వన్డేలో పోరాడిన న్యూజిలాండ్ రెండో వన్డేలో మాత్రం దారుణ ఆటతీరు ప్రదర్శిస్తుంది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ కివీస్‌పై ఒత్తిడి తెచ్చారు.15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ ఒక దశలో 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో గ్లెన్ పిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్‌లు కాసేపు ప్రతిఘటించారు. ఈ క్రమంలో స్కోరుబోర్డు 56 పరుగులకు చేరగానే కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 28 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛! 😎
— BCCI (@BCCI) January 21, 2023
Talk about a stunning grab! 🙌 🙌@hardikpandya7 took a BEAUT of a catch on his own bowling 🔽 #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/saJB6FcurA
చదవండి: IND Vs NZ: కివీస్ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు
Comments
Please login to add a commentAdd a comment