AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇక కష్టమే! | New Zealands Devon Conway Out Of T20 World Cup Final Tour Of India | Sakshi
Sakshi News home page

AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇక కష్టమే!

Published Fri, Nov 12 2021 1:47 PM | Last Updated on Fri, Nov 12 2021 2:42 PM

New Zealands Devon Conway Out Of T20 World Cup Final Tour Of India - Sakshi

New Zealands Devon Conway Out Of T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌- 2021 తుది ఘట్టానికి చేరుకుంది. నవంబర్‌-14న దుబాయ్‌ వేదికగా ఫైనల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా ఆస్ట్రేలియాతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ కీలక పోరుకు దూరమయ్యాడు.

నవంబర్‌10న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో  లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో  కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్‌ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది.

దీంతో కాన్వే  ఆస్ట్రేలియాతో ఫైనల్‌, భారత పర్యటనకు దూరమయ్యాడు. దీనిపై  స్పందించిన  న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ మాట్లడూతూ.. కాన్వే ఫైనల్‌మ్యాచ్‌కు అందు బాటులో లేకపోవడంపై నేను చాలా నిరాశ చెందుతున్నాను. ఆదే విధంగా కాన్వే కూడా ఫైనల్లో ఆడకపోవడంపై చాలా భాదపడుతున్నాడు. కాన్వే ఎప్పుడూ  న్యూజిలాండ్ తరపున ఆడటాన్ని గౌరవంగా భావిస్తాడు.

ఈ సమయంలో మేము అందరం అతడి వెంటే ఉంటాం. కాన్వే ఒక అద్బుతమైన ఆటగాడు, అతడు ఔటయ్యాక అలా చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించకుకోవలసి వచ్చింది. కాన్వే త్వరగా కోలుకుని జట్టులో తిరిగి చేరాలని నేను కోరుకుంటున్నాను అని అతడు పేర్కొన్నాడు.

చదవండి: T20 World Cup 2021 Final: ఇంటర్వెల్‌ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు మరి..అంతేగా అంతేగా!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement