CWC 2023 ENG VS NZ: జగజ్జేతలకు షాక్‌.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ | CWC 2023, ENG vs NZ: New Zealand Created History By Fastest-Ever 280 Plus Run Chase In World Cup | Sakshi
Sakshi News home page

CWC 2023 ENG VS NZ: జగజ్జేతలకు షాక్‌.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Published Thu, Oct 5 2023 9:27 PM | Last Updated on Fri, Oct 6 2023 10:40 AM

CWC 2023 ENG VS NZ: New Zealand Created History, Fastest Ever 280 Plus Run Chase In World Cup History - Sakshi

2023 వన్డే వరల్డ్‌కప్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఎడిషన్‌ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గత వరల్డ్‌కప్‌ (2019) ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్‌ టీమ్ ఈ మ్యాచ్‌లో‌ ప్రతీకారం​ తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ టీమ్‌.. ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో మట్టికరిపించి, మెగా టోర్నీలో బోణీ విజయం దక్కించుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. 

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించిన న్యూజిలాండ్‌, వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యంత వేగంగా 280 అంతకంటే ఎక్కువ స్కోర్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.  

ఈ మ్యాచ్‌లో నమోదైన మరిన్ని రికార్డులు..

  • ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరిచి ఆల్‌టైమ్‌ వరల్డ్‌కప్‌ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి పరుగులు సిక్సర్‌ రూపంలో రావడం ఇదే తొలిసారి. 
  • ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్‌ చేశారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రపంచ రికార్డు.
  • వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం- డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర (అజేయమైన 273 పరుగులు) 
  • డెవాన్‌ కాన్వే న్యూజిలాండ్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (22 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు
  • వరల్డ్‌కప్‌ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల, 321 రోజులు) రచిన్‌ రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు.
  • వరల్డ్‌కప్‌ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement