
ఆక్లాండ్: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కివీస్ ఆటగాడు డెవన్ కాన్వే సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''టీమిండియా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త టెక్నిక్‌ను ఫాలో అవుతున్నా. కిట్టీ లిట్టర్‌ను నేను ప్రాక్టీస్ చేసే పిచ్‌పై ఉపయోగిస్తున్నా. స్పిన్ బౌలర్ బంతిని ఇది కాస్త కఠినంగా మారుస్తుంది. ఇలా ఆడడం కాస్త కష్టంగా ఉన్నా.. మంచి ప్రాక్టీస్ మాత్రం లభిస్తుంది. ఇది కేవలం నా గేమ్‌ప్లాన్‌లో భాగం మాత్రమే.. రేపటి మ్యాచ్‌లో ఇది నాకు ఉపయోగపడుతుందని మాత్రం నమ్ముతున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కిట్టీ లిట్టర్ అంటే కుక్కలు, పిల్లుల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బంకమట్టితో కలిపి తయారుచేస్తారు. ఇక కాన్వే న్యూజిలాండ్ తరపున 3 వన్డేలు.. 14 టీ20లు ఆడాడు. ఇక జూన్ 18 నుంచి 22 వరకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment