Eng Vs NZ 2nd Test: Joe Root And Ollie Pope Fathers Hug Each After Sons Tons - Sakshi
Sakshi News home page

Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో!

Published Mon, Jun 13 2022 12:54 PM | Last Updated on Mon, Jun 13 2022 2:23 PM

Eng Vs NZ 2nd Test: Joe Root And Ollie Pope Fathers Hug Each After Sons Tons - Sakshi

ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న ఓలీ పోప్‌, రూట్‌ తండ్రులు(PC: England’s Barmy Army)

England Vs New Zealand Test Series 2022: బిడ్డలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు అంతకంటే మించిన ఆనందం మరొకటి ఉండదు. ముఖ్యంగా తాము ఇష్టపడి ఎంచుకున్న రంగాల్లో విజయవంతమైతే వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు జో రూట్‌, ఓలీ పోప్‌ తండ్రులు ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగిపోయారు. కుమారులు సెంచరీలు చేయడం చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ రెండో టెస్టు సందర్భంగా మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడుకుల ఆటను చూసేందుకు స్టేడియంకు వచ్చిన ఆ తండ్రులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. నాటింగ్‌హమ్‌ టెస్టులో మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (163 బ్యాటింగ్‌; 25 ఫోర్లు) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించాడు.

రూట్‌కు తోడు ఓలీ పోప్‌ (145; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా సెంచరీ చేయడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 473 పరుగులు సాధించింది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ మరో 80 పరుగుల దూరంలో ఉంది. కాగా మొదటి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్‌ జట్టును ఓడించి ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  

చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!
ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్‌ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement