జానీ బెయిర్‌స్టో, మారిజాన్ కాప్(PC: ICC)
ICC Player Of The Month June 2022 Winners: స్వదేశంలో న్యూజిలాండ్, టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. జూన్ నెలకు గానూ అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు జో రూట్‌ను అధిగమించి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం ప్రకటించింది. అదే విధంగా మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్ ఈ అవార్డు అందుకున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను పురస్కారం వరించింది.
జానీ బెయిర్‌స్టో అద్భుత ఇన్నింగ్స్
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జో రూట్, బెయిర్‌స్టో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణించి సిరీస్ గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.
ముఖ్యంగా రెండో టెస్టులో ఆఖరి రోజు ఆటలో భాగంగా బెయిర్‌స్టో 136 పరుగులతో రాణించడం విశేషం. దీంతో 5 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది. బెయిర్‌స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Rock & Roll Test Cricket 🎸🤘
— England Cricket (@englandcricket) July 6, 2022
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3
ఇక మూడో టెస్టులో వరుసగా 162, 71 (నాటౌట్) పరుగులు సాధించాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో 106, 114 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలవడం విశేషం.
కాప్ అదరగొట్టే ప్రదర్శన..
ఇంగ్లండ్ మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు సాధించిన ఆమె.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులతో అజేయంగా నిలిచారు.
Record-breaker Marizanne Kapp sums up Day 1 as the #MomentumProteas get ready for Day 2 🔊
— Cricket South Africa (@OfficialCSA) June 28, 2022
📺 SuperSport Grandstand 201
#ENGvSA #AlwaysRising #BePartOfIt pic.twitter.com/0e4THeOSPq
చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!
Comments
Please login to add a commentAdd a comment