
రవిచంద్రన్ అశ్విన్
India vs England, 4th Test : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.
టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
అశ్విన్ కంటే ముందు వాళ్లు
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్‌స్టోను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అశ్విన్ కంటే ముందు జార్జ్ జిఫెన్(ఇంగ్లండ్ మీద), మోనీ నోబుల్(ఇంగ్లండ్ మీద), విల్ఫ్రెడ్ రోడ్స్(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్ సోబర్స్(ఇంగ్లండ్ మీద), ఇయాన్ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్ బ్రాడ్(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు.
కాగా రాంచి వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. భోజన విరామ సమయానికి 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ టాపార్డర్‌ను కుప్పకూల్చి మూడు వికెట్లు వికెట్లు తీయగా.. అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్?
Ash gets a century against England... of wickets!#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/X2wxTkk7xL
— JioCinema (@JioCinema) February 23, 2024