India vs England, 1st Test: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంగా ఐసీసీ అతడిని మందలించింది. అదే విధంగా.. బుమ్రా ఖాతాలో డిమెరిట్ పాయింట్ జతచేసింది.
హైదరాబాద్ టెస్టులో ఆరు వికెట్లు
ఇంతకీ ఏం జరిగిందంటే... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ హైదరాబాద్ వేదికగా తొలి టెస్టులో తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేస్ గుర్రం బుమ్రా మొత్తం ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.
బుమ్రా మ్యాజిక్.. పోప్ డబుల్ సెంచరీ మిస్
ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కొరకరాని కొయ్యగా మారిన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్‌ను 196 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద(102.1వ ఓవర్) అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. అయితే, అంతకంటే ముందు అంటే.. 81వ ఓవర్లో పోప్ వికెట్ల మధ్య పరుగు తీస్తున్నపుడు బుమ్రా కావాలనే అతడికి అడ్డంగా వెళ్లినట్లు కనిపించింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం ఢీకొన్నారు.
పొరపాటును అంగీకరించడంతో..
ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 నిబంధన ప్రకారం.. రూల్స్‌ను అతిక్రమించాడంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి బుమ్రాను మందలించింది. ఫీల్డ్ అంపైర్లు, సంబంధిత అధికారులు బుమ్రాదే తప్పని తేల్చగా.. బుమ్రా తన పొరపాటును అంగీకరించాడు. దీంతో ఐసీసీ అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియాకు బిగ్ షాక్: రాహుల్, జడేజా దూరం.. వాళ్లకు ఛాన్స్: బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment