స్వదేశంలో మరో టెస్టు సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రాంఛీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టెస్టు సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మంగళవారం(ఫిబ్రవరి 20)రాంఛీకి చేరుకోనున్న భారత జట్టు.. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది.
అయితే రాంఛీ టెస్టుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. బుమ్రా రాజ్‌కోట్ నుంచి నేరుగా తన స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఐదో టెస్టుకు కూడా బుమ్రా అందుబాటులో ఉంటడా లేదన్నది నాల్గవ టెస్ట్ ఫలితంపై ఆధారపడి ఉంటుందని క్రిక్‌బజ్ తెలిపింది. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. కాగా నాలుగో టెస్టుతో యువ పేసర్ ఆకాష్ దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: జైశ్వాల్‌కు అన్యాయం.. డబుల్ సెంచరీ చేసినా! లేదు అదే కరెక్ట్?
Comments
Please login to add a commentAdd a comment