
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ గిల్ సత్తాచాటాడు. గిల్ ప్రస్తుతం 61 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది నాలుగో ఫిప్టీ ప్లస్ స్కోర్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు.
బంతిని చూడకుండానే భారీ సిక్సర్ బాదాడు. భారత ఇన్నింగ్స్ 33 ఓవర్ వేసిన జేమ్స్ ఆండర్సన్ రెండో బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో స్ట్రైక్‌లో ఉన్న గిల్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి బంతిని చూడకుండానే స్ట్రైట్‌గా భారీ సిక్సర్‌గా మలిచాడు. గిల్ షాట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఫిదా అయిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాట్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లకు వికెట్ నష్టానికి 202 పరుగులు చేసింది.
SHOT OF THE MATCH. 🤯
— Johns. (@CricCrazyJohns) March 8, 2024
- Shubman Gill smashed Anderson over the head for a six. pic.twitter.com/73BgI4QbyZ