టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పోప్‌.. ఏకంగా! మరి రోహిత్‌? ICC Latest Test Rankings: Ollie Pope Rapid Rise Kohli Remains Top 10 | Sakshi
Sakshi News home page

ICC Latest Rankings: ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పోప్‌.. కోహ్లి, రోహిత్‌ ర్యాంకు ఎంతంటే?

Published Wed, Jan 31 2024 4:19 PM

ICC Latest Test Rankings: Ollie Pope Rapid Rise Kohli Remains Top 10 - Sakshi

ICC Mens Test Batting Rankings: ఐసీసీ మెన్స్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ సత్తా చాటాడు. టీమిండియాతో తొలి టెస్టులో అద్భుత శతకం సాధించిన అతడు.. ఏకంగా ఇరవై స్థానాలు ఎగబాకాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమంగా 15వ ర్యాంకు సాధించాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఒలీ పోప్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పోప్‌ ఇన్నింగ్స్‌ కారణంగానే
పోప్‌ ఇన్నింగ్స్‌ కారణంగానే సొంతగడ్డపై మరింత పటిష్టమైన టీమిండియాను ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో ఓడించగలిగింది. ఈ క్రమంలో బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఈ మేరకు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు సాధించాడని  ఐసీసీ పేర్కొంది.

కోహ్లి, రోహిత్‌ ర్యాంకులు?
ఇక ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానం నిలబెట్టుకోగా.. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. భారత్‌ నుంచి కోహ్లి ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 12వ స్థానంలో నిలవగా.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరమైన రిషభ్‌ పంత్‌ 13వ స్థానంలో నిలిచాడు.

కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం కాగా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ హైదరాబాద్‌ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది.

ఐసీసీ మెన్స్‌ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌)
2. జో రూట్‌(ఇంగ్లండ్‌)
3. స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)
4. డారిల్‌ మిచెల్‌(న్యూజిలాండ్‌)
5. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)

చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్‌ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement