![Ollie Popes century helps England reach 416 on 1st day of 2nd Test vs West Indies](/styles/webp/s3/article_images/2024/07/19/oli.jpg.webp?itok=OicMkJ8i)
నాటింగ్‌హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు.
కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment