ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ హైప్రొఫైల్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ టెస్టు బ్యాటర్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో కూడా 'బాజ్‌బాల్'ను కొనసాగిస్తామని పోప్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ 'బాజ్‌బాల్(దూకుడుగా ఆడటం)' విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
మేము ఇప్పటి వరకు టెస్టుల్లో ఏ విధంగా ఆడామో అదే కొనసాగిస్తాము. ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీలు చేయాలని మాపై చాలా అంచనాలు ఉంటాయి. మేము సెంచరీలు చేయకపోతే విఫలమైనట్లు భావిస్తారు. కానీ భారత్ వంటి పరిస్ధితుల్లో అన్ని మ్యాచ్‌ల్లొ అది జరగకపోవచ్చు. కొన్ని పిచ్‌ల్లో 200 కొట్టినా మంచి స్కోరఖ్ అవ్వవచ్చు. భారత స్పిన్నర్ల నుంచి మా రైట్ హ్యాండ్ బ్యాటర్లకు గట్టి సవాలు ఎదురుకానుంది.
అశ్విన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. అతడితో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ వంటి అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. మేము పరుగులు సాధించాలంటే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడమే ఒక్కటే మార్గం. భారత్ పరిస్థితుల్లో మ్యాచ్‌లను గెలవడం అంత సులభం కాదు. కానీ గెలిచేందుకు మేము అన్ని విధాల ప్రయత్నిస్తామని ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..
Comments
Please login to add a commentAdd a comment