
హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు పంపాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్‌లో జడేజా వేసిన నాలుగో బంతిని పోప్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే స్లిప్‌లో ఉన్న రోహిత్.. డైవ్ చేస్తూ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్ బ్యాటర్ బిత్తరపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోప్ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
చదవండి: AUS VS WI 2nd Test: కోవిడ్ ఉన్నా ఆడించారు.. కానీ, ఇలా దూరం పెట్టారు..!
Whatt a Catch Rohit Sharma #RohitSharma𓃵 #Jadeja pic.twitter.com/V9oozOrEiU
— Rajeshhhhh🤐 (@johnholick) January 25, 2024