0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్‌.. రెప్పపాటులో క్యాచ్‌! | Ind vs Eng 2nd Test Vizag: Rohit Sharma Sharp Catch To Dismiss Ollie Pope | Sakshi
Sakshi News home page

Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్‌.. రెప్పపాటులో క్యాచ్‌!

Feb 5 2024 10:59 AM | Updated on Feb 5 2024 12:21 PM

Ind vs Eng 2nd Test Vizag Rohit Sharma Sharp Catch To Dismiss Ollie Pope - Sakshi

Ind vs Eng 2nd Test Vizag Day 4: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. వైజాగ్‌ వేదికగా నాలుగో రోజు ఆటలో.. ఇంగ్లండ్‌ కీలక బ్యాటర్‌ ఒలీ పోప్‌ను అవుట్‌ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

కాగా 67/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌... తొలుత రెహాన్‌ అహ్మద్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ అహ్మద్‌ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 

అప్పటికి ఇంగ్లండ్‌ స్కోరు 99/2. ఈ క్రమంలో అహ్మద్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 21 బంతుల్లోనే 23 పరుగులు సాధించి ప్రమాదకరంగా మారుతున్న పోప్‌.. రవిచంద్రన్‌ అశ్విన్‌ కి దొరికిపోయాడు.

28.2వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన పోప్‌.. బ్యాక్‌ కట్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. ఎడ్జ్‌ తీసుకున్న బంతిని.. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ మెరుపు వేగంతో అందుకున్నాడు. 

దీంతో ఇంగ్లండ్‌ ఓవరాల్‌గా మూడో వికెట్‌ కోల్పోగా.. భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కాగా 0.45 సెకన్ల వ్యవధిలోనే రోహిత్‌ శర్మ మెరుపు వేగంతో అందుకున్న షార్ప్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఒలీ పోప్‌ అవుటైన మరుసటి రెండో ఓవర్లో అశ్విన్‌ మరోసారి అద్భుత బంతితో జో రూట్‌(16)ను పెవిలియన్‌కు పంపాడు.

ఈ క్రమంలో 34 ఓవర్లలో ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమిండియా విజయానికి ఆరు వికెట్లదూరంలో నిలవగా.. ఇంగ్లండ్‌ గెలవాలంటే 234 పరుగులు కావాలి.

చదవండి: SA vs NZ: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏకంగా కెప్టెన్‌.. అంతేకాకుండా 6 వికెట్లతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement