![PAK VS ENG 1st Test: Aamer Jamal Superhuman Catch Sends Ollie Pope Packing For A Silver Duck](/styles/webp/s3/article_images/2024/10/8/f.jpg.webp?itok=5g7Aa_Q7)
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఆమెర్ జమాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఆడిన పుల్ షాట్‌ను జమాల్ 'కమాల్' క్యాచ్‌గా మలిచాడు. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జమాల్ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. జమాల్ కమాల్ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
UNBELIEVABLE CATCH 😲
Aamir Jamal pucks it out of thin air to send back the England captain 👌#PAKvENG | #TestAtHome pic.twitter.com/MY3vsto4St— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.
చదవండి: హాంగ్‌కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment