
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 3 చివరి తేదీ కావడంతో హుటాహుటిన తన దరఖాస్తును బీసీసీఐకి సమర్పించాడు. బ్యాటింగ్ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే అయినప్పటికీ.. ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను పూర్తి చేశాడు. రాథోడ్ 2019 దక్షిణాఫ్రికా సిరీస్(భారత్‌లో జరిగినది) ద్వారా టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అరంగేట్రం చేశాడు. సంజయ్ బాంగర్ నుంచి అతను పగ్గాలు చేపట్టాడు. రాథోడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది.
ఇదిలా ఉంటే, విక్రమ్ రాథోడ్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్.. బౌలింగ్ కోచ్ పదవికి పరాస్ మాంబ్రే.. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం అజయ్ రాత్రాలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోచింగ్ టీం ఎంపిక దాదాపుగా ఖరారైనట్లేనని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, టీమిండియా హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలసిందే.
చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్..