భారత జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంక పర్యటనతో అతడు తన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలో తన సహాయక సిబ్బంది నియామకంపై గంభీర్ కసరత్తులు మొదలెట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డష్కాటేను తన టీమ్‌లోకి తీసుకునేందుకు గంభీర్ ఆసక్తిగా ఉ న్నట్లు తెలుస్తోంది.
అతడికి ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. తాజాగా టెన్ డష్కాటేను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ర్యాన్ టెన్ డష్కాటే నిస్వార్థపరుడని, తను జీవితాంతం నమ్మే వ్యక్తి అతడేనని గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు.
దీంతో డష్కాటే గంభీర్ కోచింగ్ స్టాప్‌లో భాగం కావడం దాదాపు ఖారారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. కాగా టెన్ డష్కాటేకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, యూఏఈ టీ20 వంటి ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌ల్లో సపోర్ట్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు.
నెదర్లాండ్స్ తరపున 33 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతడు.. వరుసగా 1541, 533 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లో 88 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో టెన్ డష్కాటే మరి కన్పించలేదు.
Comments
Please login to add a commentAdd a comment