నేను సచిన్‌ని కాదు...
బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని జీరోగా మారిన ఓ మధ్యతరగతి క్రికెటర్ కథతో ‘ఐ యామ్ నాట్ సచిన్’ చిత్రం రూపొందనుంది. స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాల దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు.
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి.సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో మొదలు కానుంది. జీవీఎస్ ప్రకాష్ రచన చేస్తున్నారు.