g
-
డిజిటల్ రుణాల బాటలో బ్యాంకులు
ముంబై: డిజిటల్ రుణాల విధానం బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వార్షిక సదస్సు సిబాస్ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్లైన్లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలని రాయ్ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
చలి @12.5 డిగ్రీలు
♦ చలిలో ఎలా..? నైట్ షెల్టర్లు లేక అవస్థలు ♦ జీహెచ్ఎంసీ సిద్ధమైనా.. అంగీకరించని ఆస్పత్రులు ♦ వణుకుతున్న రోగుల బంధువులు ఒక్కసారిగా విజృంభించిన చలితో నగరం వణుకుతోంది. శనివారం శీతల గాలులు మరింత పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 నుంచి 12.5 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం 9.30 గంటలు వరకూ బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 5 గంటలు దాటితే కాలు బయట పెట్టలేని స్థితి ఎదురవుతోంది. మరోవైపు నగరంలోని ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు లేక... రోగుల బంధువులు రాత్రంతా చలితో గజగజలాడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: అసలే చలి కాలం. ఆపై వణికిస్తున్న శీతల గాలులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన వారిని వణికిస్తున్నాయి. మరోవైపు దోమలు తినేస్తున్నాయి. తల దాచుకుందామంటే ఆస్పత్రుల వద్ద నిలువ నీడ ఉండదు. దీంతోరోగుల బంధువుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి వారి కోసం రాత్రి బస కేంద్రాల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. ఒక్కోదానికి రూ.5.50కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. స్థలాలను కేటాయించాల్సిందిగా లేఖలు రాయ గా... నిమ్స్, సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు నిరాకరించాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిలోఫర్ న వజాత శిశువుల ఆస్పత్రి, కోఠి మెటర్నిటీ, ఈఎన్టీ ఆస్పత్రులు స్థలాలు కేటాయించాయి. దీంతో అక్కడ వసతి కేంద్రాలకు పునాదులు పడ్డాయి. మరో ఆరు నెలల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో ఆస్పత్రి ముందు వెయ్యి మందికిపైనే... ఉస్మానియా ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా మరో 1200 మంది ఇక్కడే ఉంటారు. నిలోఫర్‌లో వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా 1500 మంది ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 500 మంది చికిత్స పొందుతుం డగా... మరో 150-200 మంది రేడియేషన్ కోసం అక్కడే ఎదు రు చూస్తుంటారు. గాంధీలో 1500-2000 మంది రో గులు.... మరో 1500 మంది సహాయకులు ఉంటారు. సుల్తాన్‌బజార్,పేట్లబురుజు ప్రభు త్వ ఆస్పత్రుల్లో వెయ్యి మంది వరకు ఉంటారు. రోగుల సహాయకులకు సరైన వసతి లేకపోవడంతో వీరంతా చెట్ల కిందే తల దాచుకుంటున్నారు. మరుగు దొడ్లు లేవు. ఇన్‌పేషెంట్లకు ఇవ్వరు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి.. చిరిగిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గాంధీలో సరిపడే దుప్పట్లు ఉన్నా రోగులకు ఇవ్వడం లేదు. పొరపాటున ఎవరై నా దుప్పటి తెచ్చుకోకపోతే రాత్రంతా ఇబ్బంది పడాల్సిందే. నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో మంచాలే కాదు... దుప్పట్లు కూడా లేకపోవడంతో శిశువులు వణికిపోతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించినా... దుప్పట్ల కొనుగోలుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. దీన్ని బట్టి రోగులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
సిటీకి కొత్తందం!
►400 నగరంలో నెలకు జరిగే ప్లాస్టిక్ సర్జరీలు ►60% ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొనేవారిలో అబ్బాయిల సంఖ్య ►500 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 40 ఏళ్ల పైబడ్డవారు ►3500 ఏడాదిలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 30 ఏళ్లలోపు యువకుల సంఖ్య అందమనేది తాత్కాలికం కాకూడదు.. అది శాశ్వతంగా మనకే సొంతం కావాలి. ఇన్నాళ్లూ ఇలా ఉండిపోవచ్చు, కానీ ఇకపై మనల్ని చూస్తే కళ్లు తిప్పుకోకూడదు.. అందరి దృష్టినీ ఆకర్షించాలి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్సూ, మేకప్ ఆర్టిస్టుల క్రియేటివిటీ తాత్కాలికం.. అందం మనవద్ద లేదనేది గతం. అలా ఉండకూడదనుకుంటే ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదిద్దాం.. యవ్వనం మరింతకాలం పదిలంగా ఉండాలంటే వేరే మార్గం లేదు.. ఇదీ నగర యువత ఆలోచన. కళ్లూ, ముక్కూ, పొట్ట, హెయిర్స్టైలూ ఇవన్నీ సహజత్వంలో కాస్త బాగాలేకపోవచ్చు. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు కదా అంటున్నారు కొత్తతరం యువత. అందంగా ఉన్నామంటే దాన్నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం కూడా బోల్డెంత ఉంటుందనేది ఆలోచన. చప్పిడిముక్కు, బాల్డ్‌హెడ్, నడుముల కింద టైర్లు, బట్టతల వంటి మాటలకు కొత్త అర్థాలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో అందంగా ఉండాలన్న స్పృహ బాగా పెరిగిందని, ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారిలో 80 శాతం మంది పెళ్లికి ముందు వస్తున్నవారేనని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.వెంకటరమణ అంటున్నారు. ముప్ఫై ఏళ్ల వయసు లోపే.. ►ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరాకృతిని మార్చుకోవాలని కోరుకుంటున్న వారిలో 80 శాతం మంది 30 ఏళ్ల లోపువారే. వారిలోనే ఎక్కువ మంది పెళ్లికి ముందు వస్తున్న వారే. ►ఆకృతిని మార్చుకునే వారిలో ముక్కు (రినోప్లాస్టీ), నడుముల కింద ముడతలు, లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ ఎక్కువ. ►ఈ మధ్య కొవ్వులు తొలగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ►శరీరాకృతి ముఖ్యంగా నడుముకింద ముడతలు తొలగించుకోవాలని అనుకుంటున్న వారిలో అబ్బాయిలు ఎక్కువ. ►ముక్కు సరిచేసుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. దీన్నే షేప్ కరక్షన్ అంటారు. ►మొటిమలు పోయాక ఏర్పడ్డ మచ్చలు తొలగించుకున్న వారి సంఖ్య పెళ్లికి ముందు వస్తున్న వారిలో ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు లేకపోతే ఎలా ► సాధారణంగా ఏదైనా జబ్బుకు శస్త్రచికిత్స జరిగితే భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్లుకూడా తీసుకోవాల్సి ఉంది. ► ఉదాహరణకు నడుముకింద ముడతలు తొలగించుకునేందుకు కొవ్వులు తీస్తాం. ఆ తర్వాత మళ్లీ రాకుండా చూసుకునేందుకు జీవనశైలి మార్చుకోవాలి. లేదంటే మళ్లీ కొవ్వులు ఏర్పడితే దానికి అర్థమేముంటుంది? ► నాణ్యమైన ఉపకరణాలు, శస్త్రచికిత్సల విధానాలు వచ్చాక చాలా వరకూ ఇలాంటి ►సర్జరీలు సక్సెస్ అవుతున్నాయి. అది కూడా డాక్టర్ని బట్టి ఉంటుంది. ►చాలామందిలో ఇలాంటివి చేయించుకున్నాక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ► శరీరాకృతిని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ప్రెజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి -
నేను సచిన్‌ని కాదు...
బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని జీరోగా మారిన ఓ మధ్యతరగతి క్రికెటర్ కథతో ‘ఐ యామ్ నాట్ సచిన్’ చిత్రం రూపొందనుంది. స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాల దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి.సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో మొదలు కానుంది. జీవీఎస్ ప్రకాష్ రచన చేస్తున్నారు.