సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ఫిబ్రవరి 10 నుంచి 25వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సదస్సుల ఏర్పాటుపై గురువారం రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. జిల్లాస్థాయిలో ముందుగా రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 37 మండలాల్లో 25 మంది తహసీల్దార్లు మూడేళ్లకు పైబడి పనిచేస్తున్నారని, వీరిని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ చంపాలాల్, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.