Raghu veera reddy
-
చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, సత్యసాయి జిల్లా: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, రఘువీరా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించారు. కోర్టులో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి. చంద్రబాబు అరెస్ట్‌లో టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కాలేరు. ఆయన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారు. తాను తవ్విన గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రఘువీరారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రెండు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన అనంతరం రాజకీయాలకు దూరమైపోయారు. సొంతూరిలోనే సాధారణ జీవితం గడిపారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అనూహ్యంగా రఘువీరారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పార్టీ ఎన్నికల పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఆనాడే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన బాధ్యతలను రఘువీరారెడ్డి చిత్తశుద్ధితో నెరవేర్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధిష్టానం వద్ద రఘువీరారెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు. ఇది కూడా చదవండి: లోకేష్ లోకేషన్ ఎక్కడ? కార్లు మారుస్తూ రహస్య మీటింగ్‌లు! -
కర్నాటక ఎన్నికల వేళ రఘువీరా రీఎంట్రీ.. క్రియాశీల పాత్ర పోషిస్తారా?
నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళ క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు హఠాత్తుగా రఘువీరా మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. ఒకనాటి ఈ కాంగ్రెస్ నేత సెకండ్ ఇన్నింగ్స్‌కు కారణం ఏంటి..? మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళుగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ను ఓటమి పలుకరించింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన రఘువీరా రాజకీయ జీవితంపై రాష్ట్ర విభజన ప్రభావం బాగా పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో రఘువీరా కూడా సైలెంట్‌గా రాజకీయాల నుంచి పక్కకు జరిగి సొంత గ్రామం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతున్నపుడు ఆయన వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హఠాత్తుగా ఆయనకు రాజకీయాల మీద గాలి మళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ రఘువీరాను బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలోనే తన స్వగ్రామం నీలకంఠాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో రఘువీరా సమావేశం నిర్వహించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. కర్నాటక ఎన్నికల్లో తాను చురుగ్గా పాల్గొనబోతున్నట్లు చెప్పిన రఘువీరా.. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు. గతంలో మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? లేదా అన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికైతే కర్నాటక ఎన్నికల ప్రచారం మీదే ఆయన దృష్టి సారించారు. అక్కడ ఫలితాలు బాగుంటే తిరిగి ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారేమో చూడాలి. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న రఘువీరా ఇప్పుడు హఠాత్తుగా కర్నాటక ఎన్నికల రంగంలోకి దిగడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. -
మరోసారి వైరల్ అవుతున్న రఘువీరారెడ్డి
సాక్షి, బెంగళూరు: నీలకంఠపురం రఘువీరారెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్, మడకశిర మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన.. వయసు మీదపడుతున్న ఛాయలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. -
‘వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు’
ఏలూరు: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. వట్టి వసంత కుమార్ మరణ వార్త తెలుసుకున్న అనంతరం పూళ్ల గ్రామానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దివంగత మహానేత వైఎస్సార్‌తో అత్యంత సన్నిహిత ఉన్న వ్యక్తి వట్టి వసంత కుమార్. వితౌట్ అపాయింట్ లేకుండా వైఎస్సార్‌ను కలిసే వ్యక్తుల్లో ఉండవల్లి తరువాత వట్టి వసంత కుమార్ ఒకరు. రాజకీయంలో నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు వట్టి వసంత కుమార్’ అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ వట్టి వసంత కుమార్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ అని, నాకు అన్నతో సమానమని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి వట్టి ఎంతో కృషి చేశారన్నారు. ఆక్వా రంగంలో ట్యాక్స్ మినహాయింపునకు వసంత కుమార్ చేసిన కృషి మరవలేనిదన్నారు రఘువీరా. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ వైఎస్సార్‌కు మంచి స్నేహితుడు వట్టి వసంత కుమార్ అని మంత్రి దాడిశెటట్టి రాజా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ అని, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వసంతకుమార్ అంత్యక్రియలు ఏలూరు ఎంఎం పురంలో వట్టి వసంతకుమార్ అంతిమ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వాసుబాబు, కాంగ్రెస్ నేతలు, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వట్టి వసంతకుమార్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత -
కాంగ్రెస్‌కు బైరెడ్డి బై..బై..!
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వాఖ్యలను చూస్తే పార్టీనీ వీడేందుకే సిద్దపడినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి రఘువీరానే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది ‘కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి గ్రామ గ్రామానికి తిరుగుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నేను పాదయాత్రను చేపడితే రఘువీరా అడ్డుపడ్డారు. ఇంకో నాయకుడు ఎదగడం ఆయనకు ఇష్టం ఉండదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని రఘువీరా మరింత దిగజార్చారు. అయన కోటరీలో అందరూ చెంచాలే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నాలుగు ఓట్లు వేయించలేదు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ చేరని పరిస్థితుల్లో నేను బలోపేతం చేశాను. పీసీసీ అధ్యక్ష పదవి మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో పెట్టారు. తిరుపతిలో భరోసా యాత్రను రఘువీరా రెడ్డి నీరు గార్చారు. కాంగ్రెస్ నాశనం కావడానికి రఘువీరానే కారణం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రఘువీరాపై మాకు నమ్మకం లేదు. ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది. నేను, మా నాయకులు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయము.. రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము’అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
-
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి
సాక్షి, హైదరాబాద్ : ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నెల్లూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం లోటస్‌పాండ్‌లో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. రవిచంద్రారెడ్డితో పాటు పాతపట్నంకు చెందిన నారాయణ మూర్తి కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతోనే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. -
20లోగా టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తుపై క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు నిర్ణయంపై ఈ నెల 20లోగా స్పష్టత వస్తుందని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పార్టీ సంసిద్ధం కావాలని అధిష్టానం సూచిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే మేనిఫెస్టో, అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులపై కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకైతే పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని చెప్పారు. -
ప్రీ మేనిఫెస్టో విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీచేస్తామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను షెడ్యూల్ 9లో కలుపుతామన్నారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన సలహాలు, సూచలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ మేనిఫెస్టోని తయారు చేస్తామని రఘువీరా పేర్కొన్నారు. -
ఆ కుంభకోణం దేశంలోనే అతి పెద్దది; రఘవీరా
సాక్షి, విజయవాడ: రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్‌తో కుమ్మకై ఒక్కొ యుద్ద విమానం మీద 1000 కోట్లకు పైగా రాబందుల్లా దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్‌కు కాంట్రాక్టులు ఇవ్వడంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 31 మధ్యలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేసి.. గవర్నర్ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు కేరళకు సహాయ చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. కేరళలో ఇళ్లు కొల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున 1000 ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2019 లో కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని 97.8 శాతం మంది కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. తాము సొంతంగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు: రఘువీరా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను, ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అవసరమని, అన్ని వర్గాల ప్రజల గొంతును వినిపించేది తమ పార్టీ మాత్రమేనన్నారు. -
‘గతంలో మోదీ పారిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయం, అఫిడవిట్ మీద కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్టు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వ్యతిరేకించేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారని, ఈ ధోరణిని కాంగ్రెస్ నిలదీస్తోందన్నారు. అదేవిధంగా సోమవారం జరిగే పార్టీ సమావేశంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేలా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. గత సమావేశాల్లో యూపీఏ భాగస్వామ్యాలను ఒప్పించి తీర్మానం పెడితే మోదీ పారిపోయారని గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సహా అన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కేంద్రాన్ని నిలదీసేలా అధిష్టానాన్ని కోరామన్నారు. కాంగ్రెస్ బలపడుతుందనే డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు చేస్తున్నారని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేదన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పెట్టబోయే అవిశ్వాసానికి ఏపీలోని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని భావిస్తున్నామన్నారు. -
బాబు ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తాం..
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల(జూన్) 12న సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశమవుతారని తెలిపారు. అంతేకాక జూన్ 13న జనరల్ బాడీ సమావేశం, జూన్ 8 నుంచి 15 వరకు వంచన వారం నిర్వహిస్తామని రఘువీరా పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉమెన్ చాందీని నియమించిన విషయం తెలిసిందే. ఇదోక చాలెంజింగ్ జాబ్ అని అన్నారు.. ఏపీ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఏసీసీసీ చీఫ్ చెప్పారు. పీవీ నరసింహారావు దేశానికి నాయకత్వం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రఘువీరా కోరారు. అంతేకాక దేశానికి లౌకిక ప్రజాస్వామ్య కూటమి అవసరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సూచించారు. -
టీడీపీ దీక్షలు బూటకం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నవ నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్నవన్నీ బూటకపు దీక్షలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా నియమితులైన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. ఓట్ల కోసం సీఎం చంద్రబాబు బూటకపు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఊమెన్ చాందీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇలా ఉండగా, టీడీపీ నాలుగేళ్ల పాలనపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చార్జిషీట్ విడుదల చేస్తామని రఘువీరా ఓ ప్రకటనలో తెలిపారు. -
బీజేపీ ఓడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం..
మడకశిర : కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శిర అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి టీబీ జయచంద్ర తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 23 గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాగోడు గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. దీంతో కర్నాటక ప్రజలు మోదీ మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నిండా ముంచారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బుద్ధి నేర్పాలన్నారు. కర్నాటకలో బీజేపీని ఓడిస్తే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుందని ఆయన అన్నారు. ఎన్నికలలో బీజేపీని ఓడిస్తే ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కర్నాటక ఓటర్లు ఎంతో విజ్ఞత ఉన్న వారని.. ఈ ఎన్నికల్లో ప్రజల సత్తా ఏంటో బీజేపీకి రుచి చూపించాలని పీసీసీ చీఫ్ రఘువీరా కోరారు. -
అసెంబ్లీ రద్దు చేసి హోదా కోసం పోరాడాలి
-
సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట మారుస్తారని, ఆయన మాటలు మారుస్తున్న తీరును గమనిస్తే సీఎం మానసిక స్థితిమీద అనుమానం కలుగుతోందని ఏపీసీసీ నేతలు మండిపడ్డారు. హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు సందర్భాల్లో చంద్రబాబు తడవకొక మాట మాట్లాడారని, నిన్న (మంగళవారం) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాటలు లీకుల రూపంలో మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీకుల రూపంలో మీడియాకు లీకులిస్తూ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా మారారని అర్థమవుతోందని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం స్థానంలో టీడీపీ మరొకరికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంతజిల్లా చిత్తూరులో చంద్రబాబుకు అబద్ధాల నాయుడిగా నిక్ నేమ్ ఉండగా, ఇప్పుడు లీకుల నాయుడిగా మరోపేరు జత చేరిందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, అది ఏపీ హక్కు అని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని మరో నేతకు చంద్రబాబు అవకాశం ఇవ్వాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్లో ఎంపీ మల్లికార్జున ఖర్గే రూల్ 184 కింద నోటీసు ఇచ్చారని, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు లోక్‌సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు. మార్చి 6, 7, 8 తేదీల్లో ఛలో పార్లమెంట్ పేరిట అంతిమ పోరాటానికి పిలుపునిస్తూ ఏపీపీసీ ఉద్యమ కార్యాచరణ ఢిల్లీలో చేపట్టనున్నామని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాల్సిందిగా కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి లేఖలు రాయనున్నట్లు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు వెల్లడించారు. -
‘చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కోసం నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు చేసిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించి, పనులను ప్రారంభించింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ తవ్వించిన కాల్వల ద్వారానే పట్టిసీమకు నీళ్లిచ్చారని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం నేరంతో సమానమని పేర్కొన్నారు. తమ పార్టీపై చెబుతున్న అబద్ధాలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
‘2017 బాబు వైఫల్యనామ సంవత్సరం..’
సాక్షి, విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కొడుకు చిన్నబాబుకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. 2017లో బాబు పాలన వైఫల్యనామ సంవత్సరంగా ముగిసిందని రఘువీరా ఎద్దేవా చేశారు. అంతేకాక బాబు జాబితాలో అన్నీ అపజయాలే అని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బాబు సర్కారు రైతులను మోసం చేసిందన్నారు. ఇంటికి ఒక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతకు ఇచ్చిన హామీని సైతం అటకెక్కిందన్నారు. ఈ మూడున్నర సంవత్సారాల బాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకో దగ్గ ఐటీ కంపెనీ ఏపీవైపు చూడలేదని ఆయన అన్నారు. తొలుత గూగుల్ వంటి కంపెనీలు వస్తాయని చేసిన ప్రచారం బోగస్‌గా తెలిపోయిందని రఘువీరా పేర్కొన్నారు. ‘స్వీస్ చాలెంజ్’ విషయంలోనూ చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు అయిందని గుర్తు చేశారు. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీ, నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు సొంత పార్టీ నాయకులనే విస్మయానికి గురి చేశాయన్నారు. కాంగ్రెస్ హయంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన మన్నవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు కాపాడుకోలేకపోవడం మరో అతిపెద్ద ఫెయిల్యూర్ అని రఘువీరా అన్నారు. -
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
సీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయనగరం ఫోర్ట్: దేశంలో 2019లో జరగనున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బూత్‌స్థాయి నుంచి అలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వరకు అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ, టీడీపీలు మూడేళ్ల కాలంలో కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్తిగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జీరోగా మారిన కాంగ్రెస్ పార్టీ 2019లో ఏ విధంగా ముందుకు వెళ్తుందని విలేకరులు ప్రశ్నించగా ప్రత్యేకహోదాయే ప్రజా అజెండాగా సాగుతామన్నారు. బీజేపేతర శక్తులన్నింటితో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే ఓట్లు రావడం లేదని సొంత పార్టీ నాయకులే అంటున్నారని ప్రశ్నించగా రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహనరావు, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రహస్య ఒప్పందాలతో దోపిడీ:రఘువీరా
అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్‌తో రహస్య ఒప్పందాలు చేసుకొని సీఎం చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి రాజధాని నిర్మాణానికి చేసుకున్న ఏకపక్ష, రహస్య స్విస్ చాలెంజ్ ఒప్పందాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల పాలన పాపాలపై జూన్ 8వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా చార్జిషీట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి హోదా సాధించి తీరుతామని, అందుకు గాను వచ్చే నెల మొదటి వారం భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రత్యేక హోదాను బలపర్చిన 14 జాతీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగమైన ప్రత్యేక హోదా అమలు చేయకుండా నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించడం సరికాదన్నారు. -
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష
అనంతపురం సెంట్రల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం అనంతపురంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్ కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. -
దర్యాప్తు చేయిస్తే..బండారం బయటపడుతుంది
-
చంద్రబాబు ఎగతాళిగా మాట్లడుతున్నారు
-
ఏపీసీసీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డిని గురువారం నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డిని రఘువీరా రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. -
అంతులేని అరాచకాలవి..
రాజధాని రైతుల ఆక్రందన పీసీసీ అధ్యక్షుడురఘువీరారెడ్డి వద్ద ఆవేదన ‘ట్రాక్టర్ ఉందని పింఛన్ ఇవ్వట్లేదు. ఉచిత విద్య, వైద్యం అన్నీ ఒట్టిమాటలే. ఉపాధి అవకాశాలు లేక యువత అవస్థలు పడుతోంది. ఓల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీగర్భంలో లారీలతో పనులు చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అబ్బో.. రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న అరాచకం పరకాష్టకు చేరింది..’ అంటూ రాజధాని ప్రాంత రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడలోని ఆంధరత్న భవన్లో శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై రైతన్నలు నిప్పులు చెరిగారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏకపక్ష నిర్ణయాలే.. రాజధాని ప్రాంతంలో రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతు ప్రతినిధులుగా పేర్కొంటూ పచ్చచొక్కాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓ చానల్ తీరు చూస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిషేధిస్తే బాగుండనిపిస్తుంది. వాస్తవాలను వక్రీకరిస్తోంది. బయటి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాస్తోంది. ప్రసారం చేస్తోంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? భూములిచ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాల భూములు ఇస్తామని చెప్పి ఇప్పుడు అందులో 52 గజాలు కోత పెడుతున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురుచూస్తోంది. అన్ని పార్టీల వారూ భూములు ఇచ్చారు. అధికార పార్టీ వారు మాత్రం పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ ఏకపక్ష వైఖరిపై పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాం. అన్ని పార్టీల రైతులతో రైతు సమాఖ్య ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారంలో ఇది కార్యరూపం దాల్చుతుంది. మీరు మద్దతు తెలపాలి. - నెలికుదిటి వెంకటయ్య, రైతు, దొండపాడు గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారు గ్రామాభివృద్ధిని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం తమ ఎంపీ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించారు. పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. గ్రామకంఠం సమస్యలు పరిష్కారం కావడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. - కొమ్మినేని శివయ్య, సర్పంచి, దొండపాడు ప్రశ్నించామని.. ట్రాక్టర్లు సీజ్ చేశారు.. రాజధాని పనులు ట్రాక్టర్లతో చేయించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా నదీగర్భంలో టెన్‌టైర్ లారీలతో పనులు చేయిస్తున్నారు. ఇది అన్యాయమని పత్రికా ప్రకటన ఇచ్చా. వెంటనే నా ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఓల్టా చట్టం ప్రకారం నదీగర్భంలో లారీలను అనుమతించకూడదు. ట్రాక్టర్లు ఉన్నాయని పింఛన్లు ఇవ్వట్లేదు. ఆ ట్రాక్టర్లకు పనుల్లేక రైతాంగం పస్తులుంటోంది. మా సమస్యలు చెప్పినా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. రాజధానిలో రైతుల భూములు ఎకరం రూ.5కోట్లు అని అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇప్పుడు అక్కడ రూ.కోటి 30 లక్షలకే భూమి ధర పడిపోయింది. - ఎల్లంకి నర్సయ్య, ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, తుళ్లూరు -
'ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా'
తిరుమల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్టు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం తిరుమలలో ఆయన స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, రాయలసీమ, ఉత్తరకోస్తా ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం 12వ తేదీన 300 మంది ముఖ్యనేతలతో కలసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పార్లమెంట్ ద్వారా సంక్రమించిన హక్కుల సాధన కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ జాతీయ నేతల్ని కలుస్తామని తెలిపారు. -
'కాంగ్రెస్ మద్దతిస్తుంది'
రాజమండ్రి రూరల్ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జాప్యం వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం పార్లమెంట్‌కు పంపిస్తే.. రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పక మద్దతు ఇస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన బలిజ, తెలగ, వంటరి కాపు ప్రతినిధుల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన కాపుల పట్ల తెలుగుదేశం వైఖరిని తప్పుపట్టారు. -
'చెరువు పూడికతో కోట్లు దండుకుంటున్నారు'
హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్ నేతలు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీలో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై నరసింహన్ దృష్టికి తీసుకెళ్లినట్టు నేతలు తెలిపారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎదుర్కోలేకే చంద్రబాబు నీటి సంఘాలకు ఎన్నికలు జరపడం లేదని విమర్శించారు. ఏకాభిప్రాయం లేకుండా టీడీపీ నేతలను చైర్మన్లుగా ఎంపిక చేయడం సరికాదన్నారు. నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే 90 శాతం టీడీపీకి ఓటమే మిగులుతుందని ఆయన విమర్శించారు. చెరువుల పూడికతీతను ఉపాధి కూలీలకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా రైతులకు , కూలీలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చెరువు పూడికను రియల్ ఎస్టేట్ కు తరలిస్తూ టీడీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారన్నారు. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు'
అనంత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా మరోసారి మండిపడ్డారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని రఘువీరా విమర్శించారు. కేవలం పోలవరంతోనే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టిన 'ప్రాజెక్టు అనంత'పై టీడీపీ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు. -
డిపాజిట్లు కోల్పోయారు.. మమ్మల్ని ఎలా విమర్శిస్తారు?
కొరిటెపాడు(గుంటూరు) : సాధారణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన రఘువీరారెడ్డికి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అభినందించి సలహాలు, సూచనలు అందించాలే కానీ, అడ్డుకోవటం సరికాదన్నారు. గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 125 ఏళ్ల చరిత్ర అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకూడా గెలవలేదని, దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాని నిర్ధాక్షిణంగా విభజించారని, ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రం రూ.16,500 కోట్లు లోటు బడ్జెట్ వున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆపరేషన్ నుంచి తప్పించుకోలేవని అన్నారని, అదే ఆపరేషన్ చేశారని పుల్లారావు ఎద్దేవా చేశారు. -
'ఇదొక దండగ ప్రాజెక్టు'
మడకశిర (అనంతపురం జిల్లా):ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారాలోకేష్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబునాయుడుని బిగ్‌బాస్‌గా, ఆయన కుమారుడు నారాలోకేష్‌ను స్మాల్‌బాస్‌గా అభివర్ణించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వారు రూ.400కోట్లను దండుకోనున్నారని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తన సొంతగ్రామమైన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇదొక దండగ ప్రాజెక్టు అని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ పట్టిసీమ ప్రాజెక్టు వృథాసీమ ప్రాజెక్టుగా మారనుందని విమర్శించారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరు సాగిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం పార్టీ డబ్బుసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పని చేస్తున్నదని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మే 2న గుంటూరులో ఏపీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మే 2న గుంటూరులో ఏపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. -
క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడే ధైర్యంగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల విశ్వాసం చూరగొనే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు పార్టీకి పూర్వవైభవం ఖాయం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడలో శుక్రవారం ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రస్థాయి మేధోమథన సదస్సు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యంలో పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై టీడీపీ, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాన్నే కాంగ్రెస్ సమర్థించినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన టీడీపీ, బీజేపీలు వాటిని గాలికొదిలేశాయని, ఈ విషయాలనేప్రజల్లోకి తీసుకెళ్లి విశ్వాసాన్ని చూరగొనాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలన్నారు. ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించి.. స్వార్థంతో మరోపార్టీల్లోకి వెళ్లారనీ, ఇప్పటికీ పార్టీలో ఇమడలేమని అధైర్యపడేవారు ఉంటే వేరే పార్టీల్లో చేరినా బాధపడేది లేదన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. మేధోమథన సదస్సులో పార్టీ నేతలందరూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చాలన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు కూడా ప్రసంగించారు. మొదటి రోజు మేధోమథనంలో 75 మంది తొలిరోజు సదస్సుకు వివిధ జిల్లాల నుంచి 75 మంది నేతలు పాల్గొన్నారు. వీరిని 4 గ్రూపులుగా చేసి పలు అంశాలను చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికలప్పుడు అనుసరించిన తీరు, పార్టీ నిర్ణయాలు, పర్యవసానం, ప్రజల స్పందన వంటి అంశాలపై నేతలు కీలక సూచనలు చేశారు. చిరు, బొత్స తదితరుల గైర్హాజర్ పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులైన చిరంజీవి, బొత్స సత్యనారాయణ, టి సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్, కిశోర్‌చంద్ర దేవ్, సాయిప్రతాప్‌లు సదస్సుకు గైర్హాజరయ్యారు. -
విభజన తప్పే.. క్షమించండి: రఘువీరా
-
పాలడుగు మృతి పై రఘవీరా సంతాపం
-
దళితులకు అండగా పోరుబాట: రఘువీరా
సాక్షి, విజయవాడ బ్యూ రో: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికా రం చేపట్టిన తర్వాత దళితులపై దాడులు మొ దలయ్యాయని ఏపీపీసీ సీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కాం గ్రెస్ పార్టీ దళితుల హక్కుల పరిరక్షణకు అండగా పోరాటం చేస్తుందన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం ఏర్పా టైంది. ఈ సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. 6న గవర్నర్ నరసింహన్‌ను కలసి ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేయనున్నామన్నారు. అధికా ర పార్టీల ఆగడాలను ఎదుర్కొనేందుకు ‘దళి తుల సైన్యం’ తయారీకి బెజవాడ వర్క్‌షాప్ శ్రీ కారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పార్టీ నేత లు కిల్లి కృపారాణి, మురళీమోహన్, శైలజానాథ్, బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు, 13 జిల్లాల ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 అంశాలతో ‘విజయవాడ దళిత డిక్లరేషన్- 2014’ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. -
'డబ్బు సంచులు మోయడానికే మంత్రి పదవి'
అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. టీడీపీలో సుజనా చౌదరి ఓ బ్రోకర్ అని రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇప్పించారో చెప్పించాలని రఘువీరా డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి నారాయణకు కనీసం అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. నారాయణ కంటే మా ఊరు సర్పంచ్ నయమని రఘువీరా ఎద్దేవా చేశారు. కాలేజీ బస్సుల్లో డబ్బు సంచులు మోసేందుకే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్నారు. రుణమాఫీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని రఘువీరా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. -
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలనుఎండగట్టేందుకే పోటీ
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నందిగామలో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం నందిగామ : సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలిపినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేయడానికి, తద్వారా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూసేందుకే తాము పోటీలో ఉన్నట్లు వివరించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం రఘువీరారెడ్డి ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం కూడా పాల్గొని అయ్యదేవర కాళేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబానికి తాము ఎటువంటి నష్టం చేయలేదన్నారు. తంగిరాల కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే.. అది తెలుగుదేశం పార్టీ వల్లే అని పేర్కొన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే సంస్కృతికి టీడీపీ తిలోదకాలు ఇచ్చిందని పేర్నొన్నారు. తంగిరాల కుటుంబంపై కాంగ్రెస్‌కు సానుభూతి ఉందని, చంద్రబాబుకే లేదని, అందువల్లే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభాకరరావుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తంగిరాల ప్రభాకరరావు కుమార్తెపై టీడీపీకి సానుభూతి ఉంటే ఆమెకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి మంత్రిని చేయాలని డిమాండ్‌చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి దివాలాకోరు తనాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, ఎస్సీలకు బడ్జెట్లో నిధులను నామమాత్రంగానే కేటాయించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు ప్రచారం : జేడీ శీలం కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతిపాలు చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని చెప్పారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని, త్వరలోనే బీజేపీ ఆ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అమలుచేసిన పథకాల వల్ల పేదలకు ఎంతో మేలు కలిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోడపాటి బాబురావు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, పాలేటి సతీష్, జాఫర్, బొబ్బెళ్లపాటి శ్రీగోపాలకృష్ణసాయి, తలమాల డేవిడ్‌రాజు, కామ శ్రీను, రేపాల మోహనరావు, యండ్రపల్లి నారాయణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ నాశనానికి రఘువీరానే కారణం’
అనంతపురం అర్బన్ : నవ్యంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం కావడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డే కారణమని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవమ్మ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాశనం కావడానికి గల కారణాలు, పీసీసీ చీఫ్ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఈ నెల 20న ఢిల్లీలో నివేదిక సమర్పించినట్లు చెప్పారు. రఘువీరారెడ్డి నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నాడని ఆమె విమర్శించారు. జిల్లాలో ఓవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో, మరోవైపు బీజేపీ నాయకులతో, వైఎస్సార్సీపీ నాయకులతో, ఇటు కాంగ్రెస్ నాయకులతో తనకున్న పరిచయాలను వ్యాపార లావాదేవీలుగా మార్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడని రఘువీరాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల శాసనసభ, పార్లమెంటు సీట్లు కేటాయించడం గమనిస్తే ఆయన రాజకీయ నాటకం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఒకప్పుడు జగన్‌ను కాబోయే ముఖ్యమంత్రిని చేస్తామని నమ్మబలికిన రఘువీరా ఇప్పుడు టీడీపీ వారితో చేయి కలిపి జగన్‌పై కేసులు బలపరిచేందుకు కుట్రపన్నుతున్నాడని విమర్శించారు. అలాగే జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తన నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ మహిళా కాంగ్రెస్‌ను చిన్న చూపు చూస్తునారన్నారు. ఈ విషయాలపై సమగ్రంగా సోనియా గాంధీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. సోనియా పిలుపు మేరకు రాష్ట్రంలో మహిళ కాంగ్రెస్ కమిటీ పనిచేసి పార్టీని పటిష్టం చేస్తామని ఆమె తెలిపారు. -
దిగ్విజయ్, ఆజాద్‌లతో రఘువీరా భేటీ
సాక్షి, హైదరాబాద్: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం రాత్రి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో బసచేసిన పార్టీ పెద్దలతో రఘువీరా సమావేశమై సీమాంధ్రలో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ప్రచార సభల గురించి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించారు. చిరంజీవి, తాను కలిపి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకదఫా ప్రచారాన్ని పూర్తిచేశామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియవస్తున్నందున ఇక సీమాంధ్రపై దృష్టిసారిస్తామని దిగ్విజయ్, ఆజాద్‌లు రఘువీరాకు చెప్పారు. సోనియా, రాహుల్ సభలను వేర్వేరుగా కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించడంపై భేటీలో చర్చించారు. సీమాంధ్రలో వచ్చే నెల 4తో ప్రచారం ముగియనున్నందున ఆ లోగా వారు మూడు నాలుగు చోట్ల ప్రచారం చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పీసీసీ వర్గాలు తెలిపాయి. -
కల్యాణదుర్గంలో హస్తం గుర్తు గల్లంతు!
పోటీనుంచి వైదొలగిన కాంగ్రెస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించిన రఘువీరా నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్థిదీ ఇదే బాట సాక్షి, హైదరాబాద్: ‘‘మా పార్టీకి అభ్యర్థుల కొరత లేదు. టిక్కెట్ల కోసం వందలాది మంది పోటీ పడుతున్నారు. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాం..’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బీ ఫామ్‌ల పంపిణీ సమయంలో ధీమాగా ప్రకటించారు. కానీ నామినేషన్ల ఉపసంహరణ నాటికి సీమాంధ్రలోని కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులు ఇద్దరు పోటీనుంచి నిష్ర్కమించారు. 140 ఏళ్ల చరిత్ర, పదేళ్లపాటు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు ఈ ఎన్నికల్లో 173 స్థానాల్లోనే కనిపించనుంది. అంటే రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గుర్తు హస్తం లేకుండానే ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఈ రెండింటిలో ఒకటి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి బి.దేవేంద్రప్ప బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇది ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మొన్నటివరకు ప్రాతినిధ్యం వ హించిన నియోజకవర్గం కావడం గమనార్హం. గతంలో మడకశిర నుంచి పోటీచేసిన రఘువీరారెడ్డి ఆ నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో 2009 ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలిచారు. రెవెన్యూ మంత్రిగా చేసిన ఆయన రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షునిగా నియమితులయ్యూరు. ప్రస్తుత ఎన్నికల్లో పెనుగొండకు మారిన రఘువీరా కల్యాణదుర్గానికి ఏరికోరి దేవేంద్రప్పను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ ఆయన చివరకు బరిలోంచి తప్పుకోవడం, సొంత నియోజకవర్గంలోనే బ్యాలెట్‌పై కాంగ్రెస్ పార్టీ గుర్తు కనిపించని పరిస్థితి తలెత్తడం రఘువీరాకు ఇబ్బందికరంగా మారింది. ఇక విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్థి కూండ్రు అప్పలనాయుడు కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
బాబు, మోడీ నరహంతకులు: రఘువీరా
నిడదవోలు(పశ్చిమగోదావరి జిల్లా), న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులపై కాల్పులు జరిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు, గుజరాత్‌లోని గోధ్రాలో మారణహోమానికి కారణమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నరహంతకులుగా చరిత్రలో మిగిలిపోతారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలులో బుధవారం ఆయన మాట్లాడారు. గోధ్రా అల్లర్లకు ప్రధాన కారకుడైన మోడీని సీఎం పదవి నుంచి తొలగించి జైలుకు పంపాలని చెప్పిన చంద్రబాబు.. ఇవాళ మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుని ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలకు ద్రోహం చేశారని రఘువీరా దుయ్యబట్టారు. లౌకికవాదులెవరూ టీడీపీకి ఓటెయ్యవద్దని, ఆ పార్టీకి ఓటేస్తే ఊచకోతకు సిద్ధమైనట్టేనని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లిమాటలు చెపుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ, సోనియాలు లౌకికవాదానికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పదవులు పొంది ఆస్తులు సంపాదించుకున్న నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోవటంతో రెండోశ్రేణి నాయకులు మాత్రమే పార్టీలో ఉన్నారని తెలిపారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు!
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్ర అభ్యర్థుల ఖరారుపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలో 150 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర కమిటీ సమావేశం తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా శనివారం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. -
నేడో రేపో సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు సాగుతోంది. శుక్రవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు సమావేశమవుతున్నాయి. అనంతరం శుక్ర లేదా శనివారం తొలి జాబితా ప్రకటించనున్నారు. గురువారం కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో ఏపీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను 145 నియోజకవర్గాలపై చర్చ పూర్తయ్యింది. ఒకే పేరు వచ్చిన స్థానాలు 70కి పైగా ఉన్నాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు పేర్లున్నాయి. వీటిపై కసరత్తు జరుగుతోంది. 20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం స్పష్టత వచ్చిన నియోజకవర్గాలకు శుక్ర, శనివారాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి. లోక్‌సభ స్థానాలకు కూడా కొత్త వారిపైనే కాంగ్రెస్ ఆశలుపెట్టుకుంది. సిట్టింగ్ ఎంపీల్లో పలువురు పార్టీని వీడి వెళ్లడంతో అక్కడ కొత్తవారిని వెదుకుతోంది. ఈ నేపథ్యంలో యువత, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిచ్చి ప్రయోగం చేయాలని నిర్ణయించారు. పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఈసారి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నందున ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చన్న అభిప్రాయంతో నేతలున్నారు. పోటీకి ముందుకు వచ్చే మహిళలందరికీ అవకాశం కల్పించనున్నారు. పీసీసీ రూపొందించిన జాబితాలను ఏఐసీసీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు పరిశీలించి, అవసరమైతే మార్పులు చేయవచ్చని పార్టీవర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో 100-120 స్థానాలకు వెల్లడి: రఘువీరా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జాబితాలు పరిశీలించాక శుక్ర, శనివారాల్లో అధికారికంగా తొలి విడత జాబితా ప్రకటిస్తామన్నారు. ఇందులో 100 నుంచి 120 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు. -
చిరు అభిమాన సంఘాలకూ టికెట్లు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని కోరారు. అభిమాన సంఘాల నేతలతో చిరంజీవి మంగళవారం సాయంత్రం తన నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. తన సోదరుడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ వైపు అభిమానులు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుండడంతో చిరంజీవి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పవ న్ పేరు ప్రస్తావించకుండానే తనకే అభిమానులు మద్దతు ఇవ్వాలని చిరు కోరారు. సమావేశానంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిరు అభిమాన సంఘాలు 1,500 వరకు ఉన్నాయని, అందులో 7.5లక్షల మంది సభ్యులున్నారన్నారు. వీరంతా ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు. -
మాట్లాడుకుందాం రండి!
మాజీ మంత్రులకు రఘువీరా ఫోన్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. విభజన నిర్ణయాన్ని విబేధిస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రులు మహీధర్‌రెడ్డి, పార్థసారథిలతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను వీడే విషయంలో తొందరపడొద్దు. మాట్లాడుకుందాం రండి’’అని సూచించినట్లు తెలిసింది. వారితో పాటు పార్టీని వీడతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకూ ఫోన్ చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సీమాంధ్రలోని 13 జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులకు ఫోన్లు చేసి... పార్టీని వీడతారని అనుమానం ఉన్న నాయకుల జాబితా తనకు పంపాలని ఆదేశించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేనప్పటికీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేయాలనుకునే ఆశావహుల జాబితానూ రెండ్రోజుల్లో పీసీసీకి పంపాలని ఆదేశించారు. -
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా రఘువీరా రెడ్డి
-
వీరిక మాజీలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రఘువీరారెడ్డి.. శైలజానాథ్.. ఇద్దరూ మాజీ మంత్రులయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఆమోదించడంతో మంత్రి మండలి మొత్తం రద్దయింది. దీంతో జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు కూడా మాజీ మంత్రులయ్యారు. ఈ క్రమంలో మంత్రి హోదాలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన కళ్యాణదుర్గం-మడకశిర రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు శనివారం భూమి పూజ చేయాలన్న రఘువీరా కల కలగానే మిగిలిపోయింది. రఘువీరాపై విమర్శల వెల్లువ మడకశిర నియోజకవర్గం నుంచి 1989లో రాజకీయ అరంగేట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన రఘువీరా..కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. 1994లో ఓడిపోగా.. 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో వైఎస్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి వైఎస్ ప్రభంజనంలో విజయం సాధించారు. రెండోసారి మంత్రిగా వ్యవసాయ శా ఖను దక్కించుకున్నారు. అయితే వైఎస్ హఠాన్మరణం తర్వాత రఘువీరా దారితప్పారనే విమర్శలు ఉన్నాయి. సొంత లాభం కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. రోశయ్య మంత్రివర్గంలోనూ వ్యవసా య మంత్రిగా ఉన్న రఘువీరా.. కిరణ్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. ఈ సమయంలో పవన విద్యుదుత్పత్తి సంస్థలకు భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించారనే విమర్శలు ఉన్నా యి. ఆయన రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నప్పుడు జిల్లాకు ఒనగూరింది ఏమైనా ఉందా అంటే.. అది కళ్యాణదుర్గం, కదిరి కేంద్రాలుగా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మాత్రమే. శైలజానాథ్‌పై ఆరోపణల వెల్లువ .. శింగనమల నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ అరంగేట్రంలోనే విజయం సాధించారు. 2009లోనూ వైఎస్ హవాలో గెలుపొందారు. అనంతరం శైలజానాథ్‌కు విప్ పదవిని వైఎస్ కట్టబెట్టారు. వైఎస్ మరణానంతరం కిరణ్ మంత్రివర్గంలో జేసీ దివాకరరెడ్డికి పదవి ఇవ్వకూడదని జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధిష్టానం జేసీకి స్థానం దక్కకుండా మోకాలొడ్డింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో శైలజానాథ్ అనూహ్యంగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి శైలజానాథ్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు యూనీఫాం సరఫరాలో, సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాల భవనాల నిర్మాణంలోనూ భారీ ఎత్తున పర్సంటేజీలు దండుకున్నారనే విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచే విన్పించాయి. మంత్రి శైలజానాథ్ వ్యవహారశైలి ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రట్టవడం సంచలనం రేపింది. బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంటపల్లిలోని తన పొలానికి, ఇంటికి ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును నిర్మించుకున్న ఆయన.. తన పొలానికి హెచ్చెల్సీ నీటిని కూడా చౌర్యం చేయడం విమర్శలకు దారితీసింది. -
అమాత్యుల భూపందేరం
నెల్లూరులో 431 ఎకరాల సర్కారు భూమి రిసార్ట్స్పరం చెన్నై కార్పొరేట్ సంస్థకు అడ్డంగా భూ మినహాయింపులు కిరణ్, రఘువీరా నిర్వాకం.. సీసీఎల్ఎ వద్దన్నా పట్టించుకోని వైనం నిబంధనలకు విరుద్ధంగా జీవో.. దాని అమలుకు కలెక్టర్ ససేమిరా జీవో రద్దుకు కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సిఫార్సు పట్టించుకోని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి సాక్షి, హైదరాబాద్: ఓ కార్పొరేట్ సంస్థపై ముఖ్యమంత్రి కిరణ్, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అంతులేని ఔదార్యం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఎకరాల్లో వ్యవసాయ భూ పరిమితి మినహాయింపు ఇచ్చేశారు. అది సర్కారు భూమి అని నిర్ధారణ అయినా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్‌తో పాటు సాక్షాత్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్) కూడా వద్దంటున్నా విన్పించుకోలేదు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వివాదమవుతుందని హెచ్చరించినా ఖాతరు చేయలేదు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలు గ్రామంలో ఎకరం రూ.2 లక్షలకు పైగా పలికే 431.81 ఎకరాల సర్కారు భూమిని చెన్నైకి చెందిన ఎస్ఎఫ్ఆర్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరం చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి జీవో జారీ చేయించారు. వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి ఆ భూమికి మినహాయింపు ఇస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా 533 జీవోను జారీ చేశారు. ఆ జీవోను అమలు చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కానీ అందుకు కలెక్టర్ ససేమిరా అన్నారు. ‘‘అది ప్రభుత్వ భూమి. అక్కడ పర్యాటక కేంద్రం, హోటల్ ఏర్పాటు అసాధ్యం’’ అని స్పష్టం చేశారు. జీవోను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా కలెక్టర్ వాదననే సమర్థించారు. జీవో రద్దుకు సిఫార్సు చేస్తూ ఫైలును వారు కిరణ్‌కు, రఘువీరాకు పంపారు. కానీ అందుకు వారిద్దరూ తిరస్కరించారు. అడ్డగోలు వాదన నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలు గ్రామంలోని సర్వే నంబర్ 339లోని 431.81 ఎకరాలను వ్యవసాయేతర వినియోగానికి, పర్యాటకాభివృద్ధికి కొనుగోలు చేశామని, దానికి వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎస్ఎఫ్ఆర్ రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డెరైక్టర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎస్ఎఫ్ఆర్ కొనుగోలు చేసింది ఇనాం భూమి అని, కొందరు పెద్దలు దాన్ని బోగస్ పట్టాలతో విక్రయించారని పేర్కొంటూ, దానిపై విచారణ జరపాలని కోరుతూ కలెక్టర్‌కు గుండవోలు సర్పంచ్ వినతిపత్రం సమర్పించారు ఎస్ఎఫ్ఆర్ సంస్థ ఆ భూమిని 1997 నుంచి 1999 మధ్యలో 33 పట్టాదారుల నుంచి కొనుగోలు చేసినట్టు నెల్లూరు ఆర్డీవో తేల్చారు. దాన్ని వ్యవసాయ భూ పరిమితి చట్టం కింద మిగులు భూమిగా ప్రకటించాలని పేర్కొంటూ భూ సంస్కరణల ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఎస్ఎఫ్ఆర్కు నోటీసిచ్చారు. కానీ ఆ భూమిని కంపెనీ పేరిట కొనుగోలు చేశామని, అందులో పర్యాటక వ్యాపారం చేస్తామని, హోటల్ నిర్మాణం చేపడతామని సంస్థ పేర్కొంది. అందుకే వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని పేర్కొంది. 50 ఎకరాలకే అర్హత కంపెనీ పేరిట ఉన్నది 431.81 ఎకరాలు కాగా, వ్యవసాయ భూ పరిమితి చట్టం కింద దానికి 50 ఎకరాల మినహాయింపుకే అర్హత ఉందని ఆర్డీవో స్పష్టం చేశారు. మిగతా 381 ఎకరాలను మిగులు భూమిగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, ఆ మేరకు భూ సంస్కరణల ట్రిబ్యునల్ ముందు 2009 సెప్టెంబర్ 30లోగా స్వాధీన పత్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించారు. కానీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దానిన మిగులు భూమిగా ప్రకటించాలని ఎన్నిసార్లు నోటీసులిచ్చినా స్పందించలేదు. కండలేరు నిర్వాసితుల గోడు వినలేదు నిజానికి మిగులు భూమిలోని 60 ఎకరాలను కండలేరు రిజర్వాయర్ నిర్వాసితులైన 880 కుటుంబాలకు సహాయ పునరావాస చర్యలకు కేటాయించారు. అక్కడ బోర్‌వెల్స్‌తో పాటు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన లే ఔట్‌ను తయారు చేశారు. త్వరలో టెండర్లను పిలవనున్నారు. లోకాయుక్త ఏమందంటే.. మిగులు భూమిని 2009 సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిందిగా కంపెనీని లోకాయుక్త ఆదేశించింది. భూమిని స్వాధీనం చేసుకుని నివేదిక సమర్పించాల్సిందిగా ఆర్డీవోకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కంపెనీ నెల్లూరు భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయగా 2011 ఏప్రిల్ 8న అప్పీల్‌ను అది కొట్టేసింది. లోకాయుక్త, అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాపూర్ మండలం తహసీల్దారు కంపెనీ నుంచి 381 ఎకరాల భూమిని 2011 జూన్ 8న స్వాధీనం చేసుకున్నారు. భూమిని స్వాధీనం చేసుకున్నట్టు లోకాయుక్తకు తహసీల్దారు నివేదిక సమర్పించారు. ట్రిబ్యునల్ తీర్పుపై కంపెనీ 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కోర్టు 2011 జూన్ 22న మధ్యంతర స్టే విధించింది. అయితే మిగులు భూమిని జూన్ 8వ తేదీనే స్వాధీనం చేసుకున్నందున ఆ తీర్పు నిష్పలమే అవుతుందని ప్రభుత్వం భావించింది. -
ఉద్వేగం. ఉత్తేజం.. ఉత్సాహం...
చుట్టూ శేషాచల పర్వత పంక్తులు.. మధ్యలో జనదేవుని సన్నిధి.. జనం మెచ్చిన నాయకుడి నేతృత్వంలో రెండవ మహాప్రస్థానం. ఇంకేముంది.. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వైఎస్సార్ అభిమానులు తండోపతండాలుగా హాజరయ్యారు. ఇడుపులపాయ చేరుకున్న ప్రతి ఒక్కరు ముందుగా వైఎస్సార్ ఘాట్ సందర్శించి మహానేతకు నివాళులర్పించారు. ఆపై అభిమాననేతల ప్రసంగాలు వినాలని ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఆశలు వమ్ము కాలేదు.. ముగ్గురు ముగ్గురే అన్పించేలా ప్రసంగించారు... ఒకరు హృదయాలను ద్రవింపజే స్తే, మరొకరు కుట్రలు, కుయుక్తులకు ధీటైన జవాబునిచ్చారు.. ఇంకొకరు రాష్ట్ర దశ-దిశపై స్పష్టత నిస్తూ, పిల్లలకు అన్నలా, పెద్దలకు తమ్ముడులా, ముదుసలులకు మనువడిలా, తోబుట్టువులకు సోదరుడులా తానున్నానంటూ స్పష్టత నిచ్చారు. సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ మహాప్రజాప్రస్థానం (ప్లీనరీ) ఆదివారం ఇడుపులపాయలో నిర్వహించారు. అధ్యక్షుడితో బాటు ఇతర ముఖ్యనాయకులను పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి ఆహ్వానించారు. వైఎస్ జగన్ వేదికపైకి రాగానే ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దివంగతులైన పార్టీ నాయకులకు సంతాపం తెలిపిన అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.. కష్ట కాలంలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయ కక్షతో తన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైలులో అక్రమంగా నిర్బంధించారని, రాజకీయాలంటే ఎరుగని తాను, షర్మిల ప్రజల మధ్యకు రావాల్సి వచ్చిందని చెబుతున్నప్పుడు ప్రతినిధులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. వైఎస్, చంద్రబాబు, కిరణ్ సర్కార్ల పనితీరును నిశితంగా విశ్లేషించారు. మొత్తం మీద విజయమ్మ ప్రసంగం ప్రతినిధుల హృదయాలను కదిలించింది. ఉత్సాహం నింపిన షర్మిల ప్రసంగం... రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం.. నా పాదయాత్రలోనే ఈ విషయం స్పష్టమైంది.. కుట్రలు,కుయుక్తులు శాశ్వతం కాదు.. ప్రతి ఒక్కరూ అన్నకు తోడుగా సింహాలై గర్జించండి.. ప్రజల ఆదరాభిమానాలు మనపై ఉన్నాయి అంటూ షర్మిల చేసిన ప్రసంగం వైఎస్సార్సీపీ ప్రతినిధులను ఉత్సాహపర్చింది. కుయుక్తులతో ఆరోపణలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఏపాటిదో వారి చర్యలే స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ఎల్లో మీడియాను తూర్పారపట్టినప్పుడు ప్రతినిధుల నుంచి స్పందన వ్యక్తమైంది. బడుగులకు అండగా నిలుద్దాం ... రాబోవు కాలం మనదే.. వైఎస్ సువర్ణయుగం మరోమారు చూపిద్దాం.. బడుగులకు అండగా నిలుద్దామంటూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.. మహిళలకు సోదరుడిగా గ్యాస్ భారం భరిస్తామని, డ్వాక్రా మహిళలకు అండదండగా రుణాలు రద్దు చేస్తామని, బడిమానుతున్న పిల్లలకు అన్నగా ఆదరించి బడికెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని, వికలాంగులు, వృద్దులు, వితంతువులు, చేనేతలకు తలలో నాలుకలా నిలుస్తానని.. మూగ,చెవిటి పిల్లలకు పునర్జన్మ ప్రసాదించేందుకు శాయశక్తుల కృషి చేస్తానంటూ చేసిన వైఎస్ జగన్ ప్రసంగం ఆకట్టుకుంది. రైతులకు అండగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 101, 102 పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా గిట్టుబాటు ధరల కోసం స్థిరీకరణ నిధిని రూ.3వేల కోట్లు కేటాయిస్తామని వివరించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలను ఎండగట్టారు. ఒకే పార్టీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ రాజకీయాలు చేయడం, పార్టీ నడ పటం నాయకత్వం అన్పించుకోదని వివరించారు. లీడర్ అంటే విశ్వసనీయత, విలువలతో ఉండాలని.. పార్టీలో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఒకే మాట మీద నిబద్దతతో ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చిత్తశుద్ధితో చేస్తున్నామని, జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టామని వివరించారు.. మొత్తంగా ప్లీనరీలో జగన్, విజయమ్మ, షర్మిల చేసిన ప్రసంగాలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి.. పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాయి. ప్లీనరీ విజయవంతం ప్లీనరీ విజయవంతం కావడంతో వైఎస్ఆర్ సీపీలో నూతనోత్తేజం వెల్లివిరుస్తోంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలతోపాటు పలువురు నాయకులు ఇడుపులపాయలోనే మకాం వేసి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. -
10వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ఫిబ్రవరి 10 నుంచి 25వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సదస్సుల ఏర్పాటుపై గురువారం రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. జిల్లాస్థాయిలో ముందుగా రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 37 మండలాల్లో 25 మంది తహసీల్దార్లు మూడేళ్లకు పైబడి పనిచేస్తున్నారని, వీరిని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ చంపాలాల్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేనైతే కాంగ్రెస్ లోనే ఉంటా
-
'రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా కాంగ్రెస్ లోనే ఉంటా'
హైదరాబాద్: భవిష్యత్తులో రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ చర్చల్లో అన్ని పార్టీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 'సాక్షి'తో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ విడబోనన్నారు. అసెంబ్లీ సమావేశం ఆరో రోజుల పాటు జరిగితే రాష్ట్రపతిని అదనపు సమయం అడగాల్సిన సమయం ఉండదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు చివరి నిముషం వరకూ ప్రయత్నం చేస్తానన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశానికి సంబంధించి రఘువీరా స్సందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని అనుకోవడం లేదన్నారు. కొత్త పార్టీ ఆలోచన తనకు లేదని సీఎం తనతో చెప్పినట్టు రఘువీరా పేర్కొన్నారు. విభజనకు 2009 వ సంవత్సరం డిసెంబర్ నెలలోనే బీజం పడిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు..చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తామన్నారు. -
రెవెన్యూ శాఖలో 6 వేల పోస్టుల భర్తీ: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఆరు వేల పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులు 4,305, గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టులు 1,657 భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం జీవో జారీ చేసినందున సత్వరమే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ప్రాథమికంగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని, వచ్చే వారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలపై సమగ్రంగా చర్చించి ఖరారు చేద్దామని సూచించారు. -
బాధితులను ఆదుకుంటాం
హాలియా, న్యూస్‌లైన్ : ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న, ఇళ్లు కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ మంత్రులిద్దరూ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. పెద్దవూర ఎస్సీ కాలనీలో ఇళ్లు నీటమునిగిన బాధితులను పరామర్శించారు. అనంతరం తెప్పలమడుగు గ్రామం వద్ద పెద్దవాగు వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు ను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులు.. వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను, వరిమెదలను మంత్రులకు చూపించారు. వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రెవె న్యూ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రోడ్డు కోతకు గురికావడంతో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేక వాగు వద్దే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను మంత్రి రఘువీరారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. అనంతరం శిరసనగండ్ల గ్రామంలో కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి హాలియా మండలం వెళ్లారు. మండలంలోని అనుముల వద్ద హాలియా వాగు ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం నిడమనూరు మండల కేంద్రంలో గండిపడిన చెరువును పరిశీలించారు. గ్రామ పంచాయతీ వద్ద వరద ఉధృతికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. వెంగన్న గూడెం స్టేజీ వద్ద గ్రామస్తులు.. వర్షానికి దెబ్బతిన్న పంటలను చూపించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో గండిపడిన చెరువును పరిశీలించారు. వీరి వెంట ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జేసీ హరిజవహర్‌లాల్, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి, గుండెబోయిన రాంమూర్తి యాదవ్, అంగోతు లచ్చిరాం నాయక్, కర్నాటి లింగారెడ్డి, చేకూరి హనుమంతరావు, అనుమలు ఏడుకొండల్, మల్గిరెడ్డి లింగారెడ్డి, రమావత్ శంకర్ నాయక్, రామలింగయ్య యాదవ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నారాయణ, అల్లి పెద్దిరాజు, బొలిగొర్ల చెన్నయ్యయాదవ్, మర్ల చంద్రారెడ్డి, రాంచంద్రయ్య, నరేందర్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రులకు వినతి మిర్యాలగూడ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిలకు ఆదివారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 37 మండలాల్లోని 732 గ్రామాల్లో పంట లకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 98161 హెక్టార్లలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా 350 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. అదే విధంగా 5494 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులకు ఐఏవై(ఇందిరా ఆవాస్‌యోజన) కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారని, ఒక్కొక్క మృతుడి కుంటుంబానికి రూ 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. -
రూ. 1,727 కోట్ల నష్టం
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రూ.1,727 కోట్ల నష్టం వాటిల్లిందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఆదివారం సహచర మంత్రులు జానారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి రఘువీరా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అనంతరం రఘువీరారెడ్డి మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. వర్షాల వల్ల 14 జిల్లాల్లోని 521 మండలాల పరిధిలో 4,200 గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. 42 మంది మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వర్షాలకు కూలిపోయిన 22 వేల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో పంటలు నష్టపోయిన వారికి రూ.1,600 కోట్లను విడుదల చేశామని, బాధితులందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. రాత్రి నల్లగొండ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో తుపాను నష్టంపై రఘువీరా సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద బాధితుల్ని ఆదుకోవాలి: సీపీఐ హైదరాబాద్ : ప్రస్తుత వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో పాటు తుపాను కారణంగా మరణించిన వారిని ఆదుకోవాలని సీపీఐ శాసన సభాపక్ష నాయకుడు గుండా మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
రూ.8.15కోట్లతో వంతెన నిర్మాణం: మంత్రి రఘువీరా
పెదనందిపాడు, న్యూస్‌లైన్ :గుంటూరు-పర్చూరు ఆర్ అండ్‌బీ రోడ్డులో పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగుపై శిధిలావస్థకు చేరిన వంతెన స్థానంలో రూ. 8.15 కోట్లతో నూతన వంతెన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. వరద ముంపు పరిశీలనలో భాగంగా శనివారం మంత్రులు రఘువీరారెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి తదితరులు పెదనందిపాడు వచ్చి, శిథిలావస్థకు చేరిన వంతెనను పరిశీలించారు. కొత్త వంతెన నిర్మాణం అవశ్యంపై బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, విజయవాడ, గుంటూరు, తెనాలి మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ ( వీజీటీఎం ఉడా) చైర్మన్ వణుకూరి శ్రీనివాస్‌రెడ్డి, గుంటూరు ఏఎంసీ వైస్‌చైర్మన్ దూళిపాళ్ల మోహన్‌రావు తదితరులు మంత్రి దృష్టికి తెచ్చారు. పాత మద్రాస్ రోడ్డులో నల్లమడ వాగుపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన పురాతన వంతన కూలిపోవడంతో 1974లో వంతెన నిర్మించారన్నారు. నల్లమడ ఆధునికీకరణ పనుల అనంతరం వంతెనను పటిష్టపరచకపోవడంతో వరదనీటి ఉద్ధృతికి ప్రమాదం వాటిల్లి కూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో మంత్రి రఘువీరా స్పందిస్తూ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్ ఆలపాటి ప్రభావతి, గుంటూరు ఆర్డీవో శ్రీరామ్మూర్తి, స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, తహశీల్దార్ చావా పద్మావతి, పొన్నూరు ఏఎంసీ చైర్మన్ బొణిగల వేణుప్రసాద్ తదితరులు ఉన్నారు. అనంతరం పాలపర్రు, అన్నారం, ఉప్పలపాడు మీదుగా పంట పొలాలు, ఓగేరు వాగును పరిశీలిస్తూ మంత్రుల బృందం చిలకలూరిపేట వెళ్లింది. అన్నారం, ఉప్పలపాడుకు చెందిన రైతులు ఓగేరు వాగుపై వంతెన నిర్మించాలని మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. అన్నారం మాజీ సర్పంచి గద్దె వరప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రులకు పలు సమస్యలు విన్నవించారు. -
ఎట్టకేలకు కరువు నివేదిక
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు కరువు నివేదిక సిద్ధమవుతోంది. నెలాఖరులోగా ప్రభుత్వానికి పంపించేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏయే మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందన్న విషయంపై ఇప్పటికే వివరాలు సేకరించారు. వాటితో పాటు జిల్లాలో ఖరీఫ్ పంట పరిస్థితులపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో కరువు మండలాలను ఎట్టకేలకు కరువు నివేదికమగుర్తించి నెలాఖరులోగా నివేదికను పంపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో పంట నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టులను కేంద్రానికి సత్వరం సమర్పించాల్సి ఉందన్నారు. అనంతరం కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ వస్తుందని తెలిపారు. ఆ కమిటీ పరిశీలించి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు కరువు నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిపోయిన సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో 50 శాతానికిపైగా వ్యవసాయం వర్షాధారంగానే చేపడతారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. 30 మండలాల్లో కరువు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో దాదాపుగా 30 మండలాల్లో కరువు నెలకొంది. ఆగస్టు 30 వరకు ఉన్న వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరువు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోడానికి ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు అంతా సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. దీంతో వర్షపాతం వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికి కూడా కరువు నివేదిక సిద్ధం కాలేదు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య ఆర్డీవోల నుంచి వర్షపాతం వివరాలను సేకరించాలని భావించారు. అయితే అవి కచ్చితంగా ఉంటాయా? లేదా? అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరువు నివేదికను తయారు చేయలేదు. మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేతతయాతియో పాల్గొన్నారు. -
మంత్రి రఘువీరా పై గుర్నాధరెడ్డి సంచలన ఆరోపణలు