
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నవ నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్నవన్నీ బూటకపు దీక్షలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.
అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. ఓట్ల కోసం సీఎం చంద్రబాబు బూటకపు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఊమెన్ చాందీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇలా ఉండగా, టీడీపీ నాలుగేళ్ల పాలనపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చార్జిషీట్ విడుదల చేస్తామని రఘువీరా ఓ ప్రకటనలో తెలిపారు.