
'డబ్బు సంచులు మోయడానికే మంత్రి పదవి'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. టీడీపీలో సుజనా చౌదరి ఓ బ్రోకర్ అని రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇప్పించారో చెప్పించాలని రఘువీరా డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి నారాయణకు కనీసం అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. నారాయణ కంటే మా ఊరు సర్పంచ్ నయమని రఘువీరా ఎద్దేవా చేశారు. కాలేజీ బస్సుల్లో డబ్బు సంచులు మోసేందుకే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్నారు.
రుణమాఫీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని రఘువీరా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు ఊడిగం చేస్తోందని విమర్శించారు.