దళితులకు అండగా పోరుబాట: రఘువీరా
సాక్షి, విజయవాడ బ్యూ రో: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికా రం చేపట్టిన తర్వాత దళితులపై దాడులు మొ దలయ్యాయని ఏపీపీసీ సీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కాం గ్రెస్ పార్టీ దళితుల హక్కుల పరిరక్షణకు అండగా పోరాటం చేస్తుందన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం ఏర్పా టైంది.
ఈ సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. 6న గవర్నర్ నరసింహన్‌ను కలసి ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేయనున్నామన్నారు. అధికా ర పార్టీల ఆగడాలను ఎదుర్కొనేందుకు ‘దళి తుల సైన్యం’ తయారీకి బెజవాడ వర్క్‌షాప్ శ్రీ కారం చుట్టిందన్నారు.
కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పార్టీ నేత లు కిల్లి కృపారాణి, మురళీమోహన్, శైలజానాథ్, బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు, 13 జిల్లాల ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 అంశాలతో ‘విజయవాడ దళిత డిక్లరేషన్- 2014’ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు.