'ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా' | Raghu Veera Reddy visits Tirumala | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా'

Published Thu, Mar 10 2016 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

Raghu Veera Reddy visits Tirumala

తిరుమల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్టు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం తిరుమలలో ఆయన స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, రాయలసీమ, ఉత్తరకోస్తా ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం 12వ తేదీన 300 మంది ముఖ్యనేతలతో కలసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పార్లమెంట్ ద్వారా సంక్రమించిన హక్కుల సాధన కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ జాతీయ నేతల్ని కలుస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement