సాక్షి, హైదరాబాద్: చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని కోరారు. అభిమాన సంఘాల నేతలతో చిరంజీవి మంగళవారం సాయంత్రం తన నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. తన సోదరుడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ వైపు అభిమానులు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుండడంతో చిరంజీవి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పవ న్ పేరు ప్రస్తావించకుండానే తనకే అభిమానులు మద్దతు ఇవ్వాలని చిరు కోరారు.
సమావేశానంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిరు అభిమాన సంఘాలు 1,500 వరకు ఉన్నాయని, అందులో 7.5లక్షల మంది సభ్యులున్నారన్నారు. వీరంతా ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు.