fans associations
-
నీటి పొదుపుకై రజనీ అభిమానుల ర్యాలీ
షోళింగర్: తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని రజనీ అభిమానులు సోమవారం షోళింగర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాగునీటి ఎద్దడి తీవ్రమై ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భజలాలు పెంపొందిచడం, మొక్కలు పెంచడం పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలూరు జిల్లా రజనీ మక్కల్ మండ్రం కన్వినర్ రవి అధ్యక్షత వహించా రు. బస్టాండు, వాలాజా రోడ్డు, అరక్కోణం రోడ్డులో రజనీ అభిమానులు ర్యాలీగా వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. -
హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్
పళ్లిపట్టు: నటుడు విజయ్ 45వ పుట్టినరోజు సందర్భంగా శనివారం అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పళ్లిపట్టు రాధానగర్ విజయ్ ప్రజా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు హరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు లింగన్ పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఇందులో రామదాసు, రాజ, శశి, స్టాలిన్, సుదీష్, దురై సహా అనేక మంది పాల్గొన్నారు. అలాగే కరింబేడు విజయ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిర్‌లో బాబాకు ప్రత్యేక పాలాభిషేకం, పూజలు చేశారు. విజయ్ పేటి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఇందులో చారుకుమార్, ధరణి, చెంచయ్య, తిరుమలయ్య, గణేశ్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. వేలూరులో సినీ నటుడు విజయ్ 45వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్మురుగన్ అధ్యక్షతన అభిమానులు వేలూరు శిశుభవన్‌లోని కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వేలూరు పెట్లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలను వేశారు. వేల్మురుగన్ మాట్లాడుతూ రానున్న సూపర్ స్టార్ విజయ్ జన్మదినోత్సవ వేడుకలను అభిమానుల ఆధ్వర్యంలో శిశు భవనంలో అన్నదానం చేయడం ఆత్మ సంతప్తినిస్తుందన్నారు. త్వరలో తమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శిశు భవన్‌లోని పిల్లలకు అన్నదానం చేసి దుస్తులను దానంగా చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన చిన్నారులకు ఉంగరాలు వేశామన్నారు. కార్యక్రమంలో విజయ్ అభిమానుల సంఘం కార్పోరేషన్ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్ కార్యదర్శి రాజేష్, జాయింట్ కార్యదర్శి వివేక్, విజయ్ మండ్ర అధ్యక్షుడు శరవణన్, రేణు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో అభిమానులు విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. -
‘నా పేరు మీద అభిమాన సంఘాలు వద్దు’
సాక్షి, హైదరాబాద్ : తన పేరు మీద ఏర్పాటు చేసిన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద యువసేనలు, అభిమాన సంఘాలను అంగీకరించబోనన్నారు. తనపై అభిమానం ఉన్నవారు టీఆర్ఎస్ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచించారు. తన పేరుపై ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. -
ఫ్యాన్స్‌కు రజనీకాంత్ భారీ షాక్
చెన్నై: అభిమానులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ షాకే ఇచ్చారు. రాజకీయాలపై దృష్టిసారించిన ఆయన త్వరలో పార్టీ ఏర్పాటును ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున సీట్లు ఆశించొద్దనే ఆయన అభిమాన సంఘాలకు స్పష్టం చేశారంట. ఈ విషయాన్ని రజనీ ఫ్యాన్స్ క్లబ్ ప్రతినిధి ఒకరు శనివారం ధృవీకరించగా.. ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ‘ఈ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. సుదీర్ఘంగా అభిమానులుగా ఉన్నవాళ్లు, ఫ్యాన్స్ కమిటీ చైర్మన్లు, ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు టికెట్లు ఆశించొద్దని మొన్నీమధ్య జరిగిన సమన్వయ కమిటీలో రజనీ తేల్చి చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై త్వరలో చర్చించాలని భావిస్తున్నాం’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు. అయితే రజనీ మక్కల్ మంద్రం మాత్రం మరోలా చెబుతోంది. ‘అంతిమ నిర్ణయం రజనీదే. రాజకీయాలు వేరు.. అభిమానం వేరు’ అని మక్కల్ సంఘం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే స్పష్టత ఇవ్వని రజనీ.. సీట్ల పంపకం గురించి ఇప్పుడిప్పుడే ఆలోచించకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తీస్తున్న ఓ చిత్రం రజనీ నటిస్తుండగా, రోబో 2.0 నవంబర్‌లో రిలీజ్ కానుంది. -
ఆ ఫీలింగ్ నాకూ ఉంది- కమల్
సాక్షి, టీ.నగర్: ఆర్కేనగర్ నియోజకవర్గంలో రూ.20 టోకెన్‌ను అడ్డుకోలేకపోయాననే అపరాధ భావన తనకూ ఉందని నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ఆనంద వికటన్ వారపత్రికలో రాస్తున్న సీరియల్ కథనంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఎన్నిక గురించి మళ్లీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి విమర్శించే మీరు అందులో ఎందుకు పాలుపంచుకోలేదని ప్రశ్నిస్తున్నారని, అందులో పాలుపంచుకోనందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపారు. ఆ అపరాధ భావనతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొందరు దిష్టిబొమ్మలను దహనం చేయడం, కోర్టులో కేసు వేయడాన్ని అభిమాన సంఘాలు ఖండించినప్పటికీ వారిని వారించామని, ఇద్దరు మనుషులు సరిచేసుకోవాల్సిన వ్యవహారంలో తాము ప్రజల్ని భాగస్వాములుగా చేయడం సరికాదని అన్నారు. మయ్యం విజిల్ యాప్ జనవరిలో ప్రారంభించడం జరుగుతుందన్నారే ఎప్పుడు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పొంగల్‌కు ఇచ్చే చెరకు లాంటిది కాదని, చేదు మందుగా ఉంటుందన్నారు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని తెలిపారు. సరైన రీతిలో తీసుకువస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. -
చిరు అభిమాన సంఘాలకూ టికెట్లు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని కోరారు. అభిమాన సంఘాల నేతలతో చిరంజీవి మంగళవారం సాయంత్రం తన నివాసంలో భేటీ అయ్యారు. సమావేశానికి రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. తన సోదరుడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ వైపు అభిమానులు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుండడంతో చిరంజీవి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పవ న్ పేరు ప్రస్తావించకుండానే తనకే అభిమానులు మద్దతు ఇవ్వాలని చిరు కోరారు. సమావేశానంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిరు అభిమాన సంఘాలు 1,500 వరకు ఉన్నాయని, అందులో 7.5లక్షల మంది సభ్యులున్నారన్నారు. వీరంతా ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు.