సాక్షి, టీ.నగర్: ఆర్కేనగర్ నియోజకవర్గంలో రూ.20 టోకెన్‌ను అడ్డుకోలేకపోయాననే అపరాధ భావన తనకూ ఉందని నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ఆనంద వికటన్ వారపత్రికలో రాస్తున్న సీరియల్ కథనంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఎన్నిక గురించి మళ్లీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి విమర్శించే మీరు అందులో ఎందుకు పాలుపంచుకోలేదని ప్రశ్నిస్తున్నారని, అందులో పాలుపంచుకోనందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపారు.
ఆ అపరాధ భావనతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొందరు దిష్టిబొమ్మలను దహనం చేయడం, కోర్టులో కేసు వేయడాన్ని అభిమాన సంఘాలు ఖండించినప్పటికీ వారిని వారించామని, ఇద్దరు మనుషులు సరిచేసుకోవాల్సిన వ్యవహారంలో తాము ప్రజల్ని భాగస్వాములుగా చేయడం సరికాదని అన్నారు. మయ్యం విజిల్ యాప్ జనవరిలో ప్రారంభించడం జరుగుతుందన్నారే ఎప్పుడు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పొంగల్‌కు ఇచ్చే చెరకు లాంటిది కాదని, చేదు మందుగా ఉంటుందన్నారు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని తెలిపారు. సరైన రీతిలో తీసుకువస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment