అనంత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా మరోసారి మండిపడ్డారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని రఘువీరా విమర్శించారు. కేవలం పోలవరంతోనే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టిన 'ప్రాజెక్టు అనంత'పై టీడీపీ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు.