
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను, ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అవసరమని, అన్ని వర్గాల ప్రజల గొంతును వినిపించేది తమ పార్టీ మాత్రమేనన్నారు.