
సాక్షి, హైదరాబాద్ : ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నెల్లూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం లోటస్‌పాండ్‌లో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. రవిచంద్రారెడ్డితో పాటు పాతపట్నంకు చెందిన నారాయణ మూర్తి కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతోనే వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment