
'రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా కాంగ్రెస్ లోనే ఉంటా'
హైదరాబాద్: భవిష్యత్తులో రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ చర్చల్లో అన్ని పార్టీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 'సాక్షి'తో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ విడబోనన్నారు. అసెంబ్లీ సమావేశం ఆరో రోజుల పాటు జరిగితే రాష్ట్రపతిని అదనపు సమయం అడగాల్సిన సమయం ఉండదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు చివరి నిముషం వరకూ ప్రయత్నం చేస్తానన్నారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశానికి సంబంధించి రఘువీరా స్సందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని అనుకోవడం లేదన్నారు. కొత్త పార్టీ ఆలోచన తనకు లేదని సీఎం తనతో చెప్పినట్టు రఘువీరా పేర్కొన్నారు. విభజనకు 2009 వ సంవత్సరం డిసెంబర్ నెలలోనే బీజం పడిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు..చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తామన్నారు.