
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయం, అఫిడవిట్ మీద కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్టు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వ్యతిరేకించేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారని, ఈ ధోరణిని కాంగ్రెస్ నిలదీస్తోందన్నారు. అదేవిధంగా సోమవారం జరిగే పార్టీ సమావేశంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేలా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. గత సమావేశాల్లో యూపీఏ భాగస్వామ్యాలను ఒప్పించి తీర్మానం పెడితే మోదీ పారిపోయారని గుర్తు చేశారు.
ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సహా అన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కేంద్రాన్ని నిలదీసేలా అధిష్టానాన్ని కోరామన్నారు. కాంగ్రెస్ బలపడుతుందనే డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు చేస్తున్నారని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేదన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పెట్టబోయే అవిశ్వాసానికి ఏపీలోని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment