తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్ | man arrested for posting morphed picture of boss wife in hyderabad | Sakshi
Sakshi News home page

తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్

Published Thu, Dec 25 2014 8:48 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్ - Sakshi

తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్

హైదరాబాద్ : బాస్ తనను తిట్టినందుకు అతని భార్య ఫోటోలను మార్ఫింగ్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించి కంపెనీలోని ఉద్యోగులందరికీ పోస్ట్ చేసిన ఓ ప్రబుద్ధుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీసీ ఎస్.జయరాం తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్ (49) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగి.

విధులకు తరచుగా ఆలస్యంగా వస్తుండటంతో ఉన్నతాధికారి (బాస్) ఒకరు తీవ్రంగా మందలించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీధర్ ...బాస్ సతీమణి ఫోటోను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించాడు. ఆ ఫోటోలను కంపెనీలని ఉద్యోగులందరికీ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ పోలీసులను ఆశ్రయించటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement