ప్రభుత్వానికి పతనం తప్పదు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ కన్వీనర్ శ్రీధర్
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరి ష్కరించకపోతే ప్రభుత్వానికి పత నం తప్పదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బుధవారం హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర స్థారుు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ సమస్యలు విన్నవించుకుందామనుకుంటే సీఎం కేసీఆర్ అపారుుంట్‌మెంట్ ఇవ్వరన్నారు.
విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చైనాకు పారిపోతున్నారని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిరాహారదీక్ష చేపట్టనున్నామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతామన్నారు. ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మనది, సీఎం కేసీఆర్ మనోడు, మన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామని, కానీ, అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.