
'దేవుడు వదిలేస్తాడేయో కానీ రహానే వదలడు'
చెన్నై : ఫీల్డింగ్ అనేది ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యమని భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. 'దేవుడైనా కూడా పొరపాటున క్యాచ్ వదిలేస్తాడేమో కానీ రహానే అలా కాదు' అంటూ జట్టు ఆటగాడిని ప్రశంసించాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వెంటనే వాటి నుంచి పాఠం నేర్చుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు. లంకతో రెండో టెస్టులో కుమార సంగక్కర క్యాచ్ వదిలేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత అదే ఆటగాడు ఇచ్చిన క్యాచ్నే ఒంటి చేత్తో ఒడిసిపట్టడం చూస్తే అతని ఫీల్డింగ్ ప్రతిభ అర్థమవుతోందంటూ కితాబిచ్చాడు.
టీమిండియా ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగు చేయడంపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏ జట్టుకైనా ఫీల్డింగ్ కీలక అంశమని అన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ఫీల్డింగ్ కొంత మెరుగైందని, దీంతో లంక ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టగలిగాం. టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీన్నే నమ్ముతారని చెప్పాడు. ఈ సిరీస్ లో బాగా రాణించిన ఆటగాళ్లలో మిశ్రా ఒకడని అతడు అభిప్రాయపడ్డాడు.