ఆగిన శ్వాస.. ఆవిరైన ఆశ
చిన్నారి గిరిజ బతికొస్తుందనుకున్నవారికి నిరాశే మిగిలింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. గిరిజ మృత్యువాత పడిందన్న వార్త ఆమె కుటుంబీకులనే కాదు.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని తీవ్ర విషాదంలో ముంచింది. ఆదివారం ఉదయం బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి గిరిజను అధికారులు మంగళవారం రాత్రి 8:15కు బయటకు తీశారు.
56 గంటలపాటు శ్రమించిన యంత్రాం గం.. 45 అడుగుల లోతులో కూరుకుపోయిన గిరిజ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీసుకురాగలిగింది. కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గిరిజ అంత్యక్రియలు మంగళవారం రాత్రి 9.30కు ఆమె స్వగ్రామమైన ఎంపీపటేల్‌గూడలో నిర్వహించారు. ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్న ఆమె తల్లి సునీత సమాధి పక్కనే గిరిజ భౌతికకాయాన్ని ఖననం చేశారు.
ఇబ్రహీంపట్నం/ మంచాల: భయపడినంత దారుణం జరిగిపోయింది. నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. నీళ్లు పడకపోవడంతో పూడ్చకుండా వదిలేసిన బోరుబావి ఐదేళ్ల చిన్నారి గిరిజ పాలిట మృత్యుకుహరంగా మారింది.. బోరుబావిలో పడిపోయిన గిరిజను రక్షించేం దుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యా యి. దాదాపు 56 గంటలపాటు కొనసాగిన సుధీర్ఘ శ్రమ అనంతరం గిరిజ బోరుబావిలోనే తుదిశ్వాస విడిచిందన్న సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల తరువాత అధికారికంగా ధృవీకరించారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చివరకు విషాదంగానే ముగిసింది.
ఫలించని అధికారుల ప్రయత్నాలు..
చిన్నారి గిరిజను ప్రాణాలతో సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం చివరి దాకా చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. చిన్నారి గిరిజ బోరుబావిలో పడిం దన్న సమాచారం తెలిసిన వెంటనే.. అధికార యంత్రాంగం మొత్తం మంచాల గ్రామానికి కదిలింది. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడేం దుకు సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు కొనసాగాయి. విధి వక్రీకరించింది.. మానవ ప్రయత్నాలేవి ఫలించలేదు.. గిరిజను కాపాడే అన్ని ప్రయత్నాలు.. గిరిజ ప్రాణాలపై ఆమె బంధువులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే విధంగా ఫలితం వచ్చింది. ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని భావించిన చిన్నారి గిరిజ.. విగతజీవిగా బోరుబావిలోంచి బయటపడుతుందన్న చేదు నిజం చిన్నారి బంధువులతోపాటు అధికార యంత్రాంగాన్ని కూడా విషాదంలోకి నెట్టింది. గిరిజ బోరుబావిలో పడిపోయిందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన ఆమె అమ్మమ్మ అయిలమ్మ, తండ్రి అయిలయ్య ఇతర బంధువులు మరింత కుంగిపోయారు.
నిద్రాహారాలు మాని..
బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను ప్రాణాలతో కాపాడేందుకు ఉన్నతాధికారులు నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ.రెడ్డి కనబర్చిన శ్రద్ధ ఇతర ఉద్యోగలకు ఆదర్శంగా నిలి చింది. దాదాపు రెండు రోజుల పాటు జేసీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రెస్క్యూటీంకు అందుబాటులో ఉన్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.
అడుగడుగునా ఆటంకాలే..
బోరుబావిలో ఉన్న గిరిజ పరిస్థితిని తెలుసుకునేందుకు దాదాపు రెండు రోజుల పాటుగా ఉత్కంఠ తప్పలేదు. బోరుబావిలో ఉన్న గిరిజ ను సురక్షితంగా కాపాడేందుకు చేపట్టిన తవ్వకాల్లో అడుగడునా ఆటంకాలే ఎదురయ్యాయి. దాదాపు 45 అడుగుల లోతులో గిరిజ పడిపోయిందని ధృవీకరించుకుని ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ సోమవారం ఉదయం వరకే కొలిక్కి వస్తుందని అందరూ భావించారు. 35 అడుగుల మేరకు తవ్వకాలు జరిపిన తరువాత బండరాయి అడ్డురావడంతో తవ్వకాలకు అం తరాయం ఏర్పడింది. 50 అడుగులకంటే అధికంగా సమాంతర తవ్వకాలు చేపడితే గిరిజను బయటకు తీయవచ్చని నిర్ధారణకు వచ్చి తవ్వకాలను ప్రారంభించిన రెస్క్యూటీంకు 41 అడుగుల తవ్వకాల అనంతరం మళ్లీ బండరాయి అడ్డుతగలడంతో మరో రెండు గంటల్లో పని పూర్తవుతుందనుకుంటున్న తరుణంలో మరిం త జాప్యం ఏర్పడింది.